హైదరాబాద్‌: మార్నింగ్‌ వాకర్స్‌ పైకి దూసుకెళ్లిన కారు.. తల్లీకూతుళ్లు మృతి

|

Jul 04, 2023 | 10:47 AM

మార్నింగ్‌ వాకింగ్‌కు వెళ్లిన తల్లికూతుళ్లను కారు రూపంలో మృత్యువు కబలించింది. వెనుక వైపునుంచి వేగంగా వస్తున్న కారు వారిని ఓవర్‌ టేక్‌ చేయబోయి ప్రమాదానికి కారణం అయ్యింది. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో చోటు..

హైదరాబాద్‌: మార్నింగ్‌ వాకర్స్‌ పైకి దూసుకెళ్లిన కారు.. తల్లీకూతుళ్లు మృతి
Bandlaguda Road Accident
Follow us on

హైదరాబాద్: మార్నింగ్‌ వాకింగ్‌కు వెళ్లిన తల్లికూతుళ్లను కారు రూపంలో మృత్యువు కబలించింది. వెనుక వైపునుంచి వేగంగా వస్తున్న కారు వారిని ఓవర్‌ టేక్‌ చేయబోయి ప్రమాదానికి కారణం అయ్యింది. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

నగరం చివార్లలోని బండ్లగూడ జాగిర్‌లో ఈ రోజు ఉదయం తల్లీకూతుళ్లు అనురాత (58), మమత (26) రోడ్డుపై మార్నింగ్ వాకింగ్‌కు వెళ్తున్నారు. అతి వేగంగా ప్రమాదకర రీతిలో వస్తున్న కారు వారిని వెనుక వైపు నుంచి ఢీ కొట్టింది. అనంతరం పక్కనే ఉన్న చెట్టుకు కారు ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్‌ పరారయ్యాడు. ఈ ఘటనలో అనురాత, మమత అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో కవిత అనే మరో మహిళ, ఇంతిఖాబ్ ఆలం అనే వ్యక్తికి కూడా గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు మృత దేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తరలించారు. కారు డ్రైవర్‌ అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. పోలీసులు కారు నెంబర్ ఆధారంగా ఓనర్‌ను గుర్తించి.. అనంతరం వాహనం నడిపిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో ఘటనలో నిన్న రాత్రి కూకట్‌పల్లి ప్రాంతంలో ఓ ప్రైవేట్ బస్సు, బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.