Telangana: వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి.. కానీ కండీషన్స్ అప్లై..

|

Nov 29, 2022 | 4:46 PM

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమ ఇచ్చింది. నర్సంపేట పోలీసులు పాదయాత్రకు అనుమతి రద్దు చేశారని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో వైఎస్సార్టీపీ లంచ్‌..

Telangana: వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి.. కానీ కండీషన్స్ అప్లై..
Telangana High Court
Follow us on

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమ ఇచ్చింది. నర్సంపేట పోలీసులు పాదయాత్రకు అనుమతి రద్దు చేశారని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో వైఎస్సార్టీపీ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. లింగగిరి వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు పాదయాత్రకు ఆటంకం సృష్టించారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాదయాత్ర కోసం తాజాగా దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. ఆ పార్టీ నేత రవీంద్రనాథ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు పాదయాత్రకు ఆటంకం సృష్టించారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం.. సీఎం కేసీఆర్, రాజకీయ, మత పరమైన అంశాలపై అభ్యంతర వ్యాఖ్యలు చేయవద్దని షరతులు విధించింది. అనంతంరం వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతివ్వాలని కోర్టు, పోలీసులను ఆదేశించింది.

మరోవైపు.. హైదరాబాద్ లో షర్మిల చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. సోమవారం వరంగల్ లో బస్సుకు నిప్పు పెట్టిన ఘటనకు నిరసనగా ప్రగతి భవన్ ముట్టడికి వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. కారులో వెళ్తున్న ఆమెను పంజాగుట్ట చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అయినా ఆమె కారు దిగలేదు. ట్రాఫిక్ జామ్, శాంతి భద్రతల సమస్యను సాకుగా చూపిన పోలీసులు షర్మిల కారులో ఉండగానే కారుతో సహా షర్మిలను ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో కార్యకర్తలు నిరసన చేశారు. ఈ పరిస్థితుల నడుమ అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

కాగా.. కుమార్తెను చూసేందుకు ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు బయల్దేరిన వైఎస్‌ విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌కు రానీయకుండా ఇంటి వద్దే అడ్డుకున్నారు. షర్మిలపై పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. రాజ్‌భవన్‌ రోడ్డులో కలకలం సృష్టించిన వైఎస్‌ షర్మిల కారును.. షర్మిలతో సహా పోలీసులు లిఫ్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని షర్మిలను విడుదల చేయాలని కార్యకర్తలు ఆందోళన చేశారు. దీంతో పోలీసులు వారిని కూడా అరెస్ట్ చేశారు. లోపలికి రాకుండా బారీకేడ్లు అడ్డుపెట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..