Agneepath: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ అల్లర్ల కేసులో కీలక మలుపు.. ఆర్మీ అభ్యర్థులకు ఊరటనిస్తూ..

|

Aug 01, 2022 | 3:30 PM

Agneepath Scheme: భారత త్రివిధ దళాల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియలో మార్పులు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌ ఎలాంటి రచ్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన...

Agneepath: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ అల్లర్ల కేసులో కీలక మలుపు.. ఆర్మీ అభ్యర్థులకు ఊరటనిస్తూ..
Follow us on

Agneepath Scheme: భారత త్రివిధ దళాల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియలో మార్పులు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌ ఎలాంటి రచ్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్మీ ఉద్యోగుల భద్రతను అగ్నిపథ్‌ ప్రశ్నార్థకంగా మార్చుతుందన్న అనుమానాలతో అభ్యర్థులు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు. ఈ క్రమంలోనే ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. రైల్వే ఆస్తిని నష్టపరిచారన్న కారణంతో పోలీసులు పలువురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇదిలా ఉంటే సికింద్రాబాద్ రైల్వే అల్లర్ల కేసులో అరెస్ట్‌ అయిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ అభ్యర్థులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆర్మీ రిక్రూట్మెంట్ అభ్యర్థుల తరఫున టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో కోర్టు సోమవారం బెయిల్‌ ఇచ్చింది. తాజాగా 16 మంది ఆర్మీ అభ్యర్థులకు హైకోర్ట్‌ షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. అభ్యర్థులు రూ. 20 వేలు పూచికత్తు, ఇద్దరు షూరిటీలను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..