
దిత్వా తుఫాను దూసుకొస్తుంది.. ఇప్పటికే అతలాకుతలం అవుతున్న తమిళనాడు, పుదుచ్చేరికి మరింత ముప్పు పొంచి ఉంది. ఏపీలో తెల్లారే సరికి ఎప్పుడైనా ఫ్లాష్ ఫ్లడ్ రావచ్చంటూ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. తెలంగాణలో వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. తెలంగాణలో పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు ఈ కింది విధంగా ఉన్నాయి..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్న నైరుతి బంగాళాఖాతం – ఉత్తర శ్రీలంకకు ఆనుకుని ఉన్న ప్రాంతంలో ఉన్న చక్రవాత తుఫాన్ దిత్వా ఇంచుమించు ఉత్తర దిశలో కదిలి, ఈరోజు 30 నవంబర్ 2025 ఉదయం 8:30 గంటల సమయానికి కడలూరుకు తూర్పు ఆగ్నేయంగా 100 కిలోమీటర్లు., కరైకల్ తూర్పు ఈశాన్యంగా 100 కి. మీ, పుదుచ్చేరి కు దక్షిణ-ఆగ్నేయంగా 180 కి.మీ., చెన్నై కు దక్షిణం ఆగ్నేయంగా 180 కి.మీ. దూరంలో కొనసాగుతోంది.
ఈ తుఫాన్ కేంద్రం ప్రస్తుతం పుదుచ్చేరి తమిళనాడు తీరాల నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాగల 24 గంటల్లో ఈ దిత్వా తుఫాను ఉత్తర- దిశగా ఉత్తర తమిళనాడు తీరానికి సమాంతరంగా కదిలే అవకాశం ఉంది. ఈరోజు 30 నవంబర్ మధ్యాహ్నం/సాయంత్రం సమయానికి ఈ తుఫాను కేంద్రం నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల సమీపంలో 30 నుండి 60 కి.మీ దూరంలో కొనసాగే అవకాశం లేదా.. చేరుకునే అవకాశం ఉంది.
ఆదివారం సోమవారం రాష్ట్రంలోని కొన్నిజిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని దక్షిణ, తూర్పు జిల్లాలలో కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. మంగళవారం రాష్ట్రంలోని కొన్ని తూర్పు, దక్షిణ జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఆదివారం, సోమవారం రాష్ట్రంలోని కొన్ని దక్షిణ – తూర్పు జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..