Hyderabad: గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Hyderabad: డబుల్ బెడ్‌రూం కాలనీల్లో నివసించే కుటుంబాలకు అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మినీ రైతు బజార్లు, షాపింగ్ కాంప్లెక్సులు, నిత్యావసర వస్తువుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఖాళీగా ఉన్న కొన్ని దుకాణాలను వేలం వేసిన..

Hyderabad: గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Double Bedroom Housing

Edited By:

Updated on: Jun 12, 2026 | 1:19 PM

Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఇప్పటికే నిర్మాణం పూర్తైనప్పటికీ కొంతమంది లబ్ధిదారులు ఇళ్లలో నివాసం ఉండకపోవడం, మరికొన్ని గృహ సముదాయాలు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడం నేపథ్యంలో కొత్త అర్హులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కలిపి సుమారు 15 వేల డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఖాళీగా లేదా అందుబాటులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ గృహ సముదాయాలకు ఐదు కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న పేద కుటుంబాలకు ప్రాధాన్యం ఇచ్చి ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రెవెన్యూ, హౌసింగ్ శాఖలు సంయుక్తంగా క్షేత్రస్థాయి సర్వే చేపడుతున్నాయి. అర్హుల ఎంపికలో సొంత ఇల్లు లేకపోవడం, గతంలో ప్రభుత్వ గృహ పథకాల ద్వారా ఇల్లు పొందకపోవడం వంటి అంశాలను ప్రధాన ప్రమాణాలుగా పరిగణిస్తున్నారు. అలాగే ఇప్పటికే ఉన్న ఎల్-2 జాబితాలోని అభ్యర్థులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.

మరోవైపు, డబుల్ బెడ్‌రూం ఇల్లు మంజూరైనా అందులో నివాసం ఉండని లబ్ధిదారులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. ఇళ్లను ఖాళీగా ఉంచిన వారికి తుది నోటీసులు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. నిర్దేశించిన గడువులోగా స్పందించని వారి కేటాయింపులను రద్దు చేసి, ఆ ఇళ్లను కొత్త అర్హులకు ఇవ్వాలని సూచనలు జారీ చేశారు. మేడ్చల్ జిల్లాలో గండిమైసమ్మ, దుండిగల్ ఫేజ్-2 ప్రాంతాల్లో కొనసాగుతున్న గృహ నిర్మాణ పనులను హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్, జిల్లా కలెక్టర్ మను చౌదరి పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న 6 వేలకుపైగా ఇళ్లను ఈ నెలాఖరులోపు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

ఇది కూడా చదవండి: Best Scheme: ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా రూ.7 లక్షల బీమా.. డైరెక్ట్‌గా నామినీ అకౌంట్లోకి..

ఇవి కూడా చదవండి

డబుల్ బెడ్‌రూం కాలనీల్లో నివసించే కుటుంబాలకు అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మినీ రైతు బజార్లు, షాపింగ్ కాంప్లెక్సులు, నిత్యావసర వస్తువుల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఖాళీగా ఉన్న కొన్ని దుకాణాలను వేలం వేసిన అధికారులు, వాటిలో రైతు బజార్లను ప్రారంభించే ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేషన్ పంపిణీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఇదే సమయంలో హౌసింగ్ బోర్డుకు చెందిన భూముల పరిరక్షణపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో భూముల ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా హౌసింగ్ బోర్డు ఆస్తుల వివరాలను సేకరించే ప్రక్రియ మొదలైంది. హౌసింగ్ బోర్డు ఆధీనంలో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి. వాటి విస్తీర్ణం ఎంత, ఏ సర్వే నంబర్లలో ఉన్నాయి, ఎక్కడైనా ఆక్రమణలు లేదా వివాదాలు ఉన్నాయా అనే అంశాలపై అధికారులు సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు. భవిష్యత్తులో ఆక్రమణలను అరికట్టడంతో పాటు ప్రభుత్వ ఆస్తులను రక్షించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Silver Price: రెండు నెలల్లో రూ.40 వేలు తగ్గిన వెండి ధర.. ప్రస్తుతం ఎంత ఉందో తెలుసా..?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us