Telangana Corona Cases: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. 5వేల మార్క్ దాటిన పాజిటివ్ కేసులు..

|

Apr 18, 2021 | 10:11 AM

Telangana Corona Cases: తెలంగాణలో రోజు రోజుకు కరోనా ఉధృతి పెరుగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతుండటంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా నమోదువుతున్నాయి.

Telangana Corona Cases: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. 5వేల మార్క్ దాటిన పాజిటివ్ కేసులు..
Follow us on

Telangana Corona Cases: తెలంగాణలో రోజు రోజుకు కరోనా ఉధృతి పెరుగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువవుతుండటంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా నమోదువుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5,093 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. శుక్రవారం ఒక్క రోజు 4,443 కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పుడు 5 వేల మార్క్‌ను దాటాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,51,424 మంది కరోనా బారిన పడ్డారు. ఇదే సమయంలో 1,555 మంది కరోనాను జయించగా.. 15 మంది కరోనా ప్రభావంతో మృత్యువాత పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,12,563 మంది కరోనా నుంచి కోలుకోగా.. 1,824 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మరణాల రేటు 0.51 శాతంగా ఉంది. అదే సమయంలో రికవరీ రేటు 88.94శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 37,037 యాక్టీవ్ కేసులు ఉండగా.. వీరిలో 24,156 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,17,37,753 మంది నుంచి సాంపిల్స్ సేకరించగా.. శనివారం ఒక్కరోజు 1,29,637 మంది నుంచి సాంపిల్స్ సేకరించారు.

ఇదిలాఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 743 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి-488, రంగారెడ్డి-407, నిజామాబాద్-367, వరంగల్ అర్బన్-175, వికారాబాద్-122, సిద్దిపేట్-117, సంగారెడ్డి్-232, రాజన్న సిరిసిల్ల-106, నిర్మల్- 139, నల్లగొండ-139, నాగర్‌కర్నూల్-101, మెదక్-101, మంచిర్యాల-124, మహబూబ్‌నగర్-168, ఖమ్మం-155, కరీంనగర్-149, కామారెడ్డి-232, జగిత్యాల-223 చొప్పున ఈ జిల్లా్ల్లో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Also read:

RIP Vivek: మరో నవ్వుల రారాజును కోల్పోయిన వెండితెర.. 35 ఏళ్లకు పైగా సినిమానే జీవితంగా బ్రతికిన కామెడీ కింగ్

Fashion show : విశాఖలో శ్రీమతి వైజాగ్ ట్రెడిషనల్ ఫేషన్ షో ఫైనల్.. ర్యాంప్ పై హంస నడకలతో అదరగొట్టిన ఆంటీలు.!

Gold Seized: చెన్నై విమానాశ్రయంలో ఆరు కిలోల బంగారం స్వాధీనం.. ఎంత విలువ ఉంటుందో తెలుసా..?