Veer Savarkar: సాలార్‌జంగ్‌ మ్యూజియంలో ఫోటో రచ్చ.. సావర్కర్‌పై కాంగ్రెస్‌ అభ్యంతరం..

|

May 29, 2022 | 1:44 PM

Swatantra Veer Savarkar: బ్రిటీష్ అధికారాన్ని ధిక్కరించి, స్వాతంత్ర్య పోరాటాన్ని వారి దేశ రాజధాని నడిగడ్డ మీదకు తీసుకెళ్లిన విప్లవవీరుడు. ఎందరో విప్లవవీరులకి.. స్వాతంత్ర్య సమరయోధులకి స్ఫూర్తినిచ్చిన ధీరుడు.

Veer Savarkar: సాలార్‌జంగ్‌ మ్యూజియంలో ఫోటో రచ్చ.. సావర్కర్‌పై కాంగ్రెస్‌ అభ్యంతరం..
Savarkar
Follow us on

వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌.. (Savarkar)ఈ పేరు వినగానే భారతీయులందరి మదిలో దేశభక్తి ఉప్పొంగుతుంది. బ్రిటీష్ అధికారాన్ని ధిక్కరించి, స్వాతంత్ర్య పోరాటాన్ని వారి దేశ రాజధాని నడిగడ్డ మీదకు తీసుకెళ్లిన విప్లవవీరుడు. ఎందరో విప్లవవీరులకి.. స్వాతంత్ర్య సమరయోధులకి స్ఫూర్తినిచ్చిన ధీరుడు. అండమాన్‌ జైలులో 27ఏళ్లు దుర్భర జీవితం గడిపినా చలించని ధీరుడు. అలాంటి గొప్ప వ్యక్తి ఫోటో వివాదాస్పదంగా మారింది. పొలిటికల్ ఇష్యూగా మారిపోయింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులోభాగంగా 75 మంది ప్రముఖ ఫ్రీడమ్ ఫైటర్‌ల చిత్రపటాలతో కూడిన ప్రత్యేక గ్యాలరీని హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఆ 75 మంది స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాల్లో సావర్కర్ ఫోటో కూడా ఉంది. దీనిపైనే కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు.. మ్యూజియంలో ఆవిష్కరించిన ఫోటోలను తిలకించారు. ఫ్రీడమ్‌ మూమెంట్‌ను గుర్తుకు తెచ్చుకున్నారు. సావర్కర్ ఫోటో కనిపించగానే అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఆ చిత్రపటాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అసలు సావర్కర్‌ ఫ్రీడమ్‌ ఫైటరే కాదన్నది కాంగ్రెస్ వాదన.

బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోందని కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దేశ తొలి ప్రధాని నెహ్రూ ఫోటో లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూనే.. సావర్కర్‌ ఫోటో ఏర్పాటుతో జాతికి ఏం మేసేజ్‌ ఇస్తున్నారని ప్రశ్నిస్తోంది.

మ్యాటర్ వివాదాస్పదం కావడంతో సాలార్‌జంగ్ మ్యూజియం అధికారులు వివరణ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోనే ఫ్రీడమ్ ఫైటర్స్ చిత్రపటాల్ని గ్యాలరీలో ఏర్పాటు చేశామన్నారు. మొత్తానికి సావర్కర్ చిత్రమ్‌ పొలిటికల్‌గా చిచ్చు రేపుతోంది.