AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నైరుతి గాలుల ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు నుంచి ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కొనసాగనున్నాయని అధికారులు పేర్కొన్నారు.

నైరుతి గాలుల ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
Weather Update
Shaik Madar Saheb
|

Updated on: Jul 08, 2026 | 3:42 PM

Share

తెలుగు రాష్ట్రాలతో వరణుడు దోబూచులాడుతున్నాడు. అతిభారీ వర్షం కురిసేలా మబ్బులు కనిపిస్తున్నాయి. కానీ చిరుజల్లులు కురిశాక మబ్బులు మాయమైపోతున్నాయి. ఈ క్రమంలో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అల్పపీడనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. నైరుతి రుతుపవనాల ఉత్తర సరిహద్దు రేఖ (Northern Limit of Monsoon) 24.5°N/65°E, బార్మర్, జోధ్ పూర్, రాజ్‌గఢ్ (చురు జిల్లా), భటిండా, 32.5°N/70°E గుండా కొనసాగుతోంది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ లోని మిగిలిన ప్రాంతాలతో పాటు దేశమంతటా మరింత ముందుకు సాగడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.

నిన్న తూర్పు మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాల్లో ఉన్న తీవ్ర అల్పపీడన ప్రాంతం (Well-Marked Low Pressure Area) ఈరోజు, 8 జూలై 2026 ఉదయం 08:30 గంటల సమయానికి వాయువ్య మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న నైరుతి ఉత్తర ప్రదేశ్ మీదుగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం (Cyclonic Circulation) సముద్ర మట్టానికి 9.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణంగా వంగి ఉంది. ఇది కొంత సమయం పాటు ఉత్తర-వాయువ్య దిశగా కదిలి, ఆ తర్వాత ఈశాన్య దిశగా మళ్లే అవకాశం ఉంది. ఈ వాతావరణ వ్యవస్థ తెలంగాణకు చాలా దూరంగా వెళ్లినందున, దీని ప్రభావం తెలంగాణ రాష్ట్ర వాతావరణంపై ఇక ఉండదు.

రాగల మూడు రోజులకు వాతావరణ సూచన (FORECAST FOR NEXT 3 DAYS):

08-07-2026 తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

09-07-2026 తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

10-07-2026 తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

రాగల మూడు రోజులకు వాతావరణ హెచ్చరికలు (WARNINGS FOR NEXT 3 DAYS):

రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు (Strong surface winds) వీచే అవకాశం ఉంది.

ఏపీలో వర్షాలు..

ఇదిలాఉంటే.. ఏపీలో సైతం వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనావేసింది. నైరుతి గాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఐదు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

Follow Us