Hyderabad: తక్కువ ధరలో, సురక్షిత ప్రయాణానికి కేరాఫ్‌ MMTS సేవలు: దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌

|

Apr 14, 2022 | 2:49 PM

Hyderabad: హైదరాబాద్‌ నగర వాసులకు ఎమ్‌ఎమ్‌టీఎస్ (MMTS) సర్వీసులు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నగరం నలుమూలల నుంచి ఉద్యోగాలకు, వ్యాపారాలకు వెళ్లే వారికి తక్కువ ధరలో సురక్షిత ప్రయాణాన్ని అందిస్తుంటాయి....

Hyderabad: తక్కువ ధరలో, సురక్షిత ప్రయాణానికి కేరాఫ్‌ MMTS సేవలు: దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌
Mmts Hyderabad
Follow us on

Hyderabad: హైదరాబాద్‌ నగర వాసులకు ఎమ్‌ఎమ్‌టీఎస్ (MMTS) సర్వీసులు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నగరం నలుమూలల నుంచి ఉద్యోగాలకు, వ్యాపారాలకు వెళ్లే వారికి తక్కువ ధరలో సురక్షిత ప్రయాణాన్ని అందిస్తుంటాయి. నగరంలో చాలా మంది వీటి సేవలను ఉపయోగించుకుంటున్నారు. ఇదిలా ఉంటే కరోనా కారణంగా కొన్ని రోజుల పాటు సర్వీసులను నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కరోనా తగ్గుముఖం పట్టడంతో మళ్లీ సర్వీసులను దశల వారి పునరుద్ధరిస్తున్నారు అధికారులు. ఈ క్రమంలోనే ప్రస్తుతం నగరంలో మొత్తం 86 ఎమ్‌ఎమ్‌టీఎస్‌ సర్వీసులను నడిపిస్తున్నారు.

తాజాగా దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్ (ఇన్‌చార్జి) శ్రీ అరుణ్‌ కుమార్‌ జైన్‌ ఎమ్‌ఎమ్‌టీఎస్‌ అందిస్తోన్న సేవల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్‌ఎమ్‌టీఎస్‌ విశిష్టతలను వివరించారు. ‘నగరంలోని దక్షిణ, తూర్పు ప్రాంతాలను వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న పశ్చిమ ప్రాంతంతో అనుసంధానిస్తూ ఫలక్‌నుమా ` సికింద్రాబాద్‌ ` హైదరాబాద్‌ ` బేగంపేట్‌ ` లింగంపల్లి ` తెల్లాపూర్‌ ` రామచంద్రాపురం ప్రాంతాల మీదుగా 29 రైల్వే స్టేషన్లను కవర్‌ చేస్తూ 50 కిమీల మేర సర్వీసులను నడుపుతోంది. ప్రయాణికుల రద్దీ, గమ్యస్థానాలను పరిగణలోకి తీసుకుంటూ.. వివిధ రంగాల ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎమ్‌ఎమ్‌టీఎస్‌ సర్వీసుల షెడ్యూలు చేశాము. ఉద్యోగరీత్య వెళ్లే వారికి, కుటుంబ అవసరాల మేరకు దూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఉపయోగపడేలా ఎమ్‌ఎమ్‌టీఎస్‌ రైళ్ల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాము’ అని ఆయన తెలిపారు.

ఎమ్‌ఎమ్‌టీఎస్‌ సర్వీసులు తెల్లవారుజామున 04.30 గంటలకు ప్రారంభమై అర్థరాత్రి 00.30 గంటల వరకు నడుస్తున్నాయి. అంతేకాక, కనీస చార్జీ రూ.5, గరిష్టంగా రూ.15 చార్జీతో జంటనగరాల్లోని వివిధ ప్రజా రవాణా చార్జీల కంటే ఎమ్‌ఎమ్‌టీఎస్‌ సమర్థవంతంగా తక్కువ చార్జీలతో సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇతర రవాణా వ్యవస్థతో పోలిస్తే రోజువారీ ప్రయాణికులకు తక్కువ ధరతో ఎమ్‌ఎమ్‌టీఎస్‌ సీజనల్‌ టికెట్‌ సౌలభ్యం కూడా అందుబాటులో ఉంది. బుకింగ్‌ కౌంటర్లలోనే కాకుండా ఎమ్‌మ్‌టీఎస్‌ టికెట్లను ఆటోమెటిక్‌ టికెట్‌ వెండిరగ్‌ మెషిన్లు (ఏటివిఎమ్‌లు), అన్‌రిజర్వ్‌డ్‌ టికెటింగ్‌ సిస్టం (యూటీఎస్‌) మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా పొందవచ్చని అరుణ్‌ కుమార్‌ తెలిపారు. అంతేకాకుండా ఎలాంటి ఆటంకాలు లేని ప్రయాణం కోసం నగదు రహిత టికెటింగ్‌ నిర్వహణను, సీజన్‌ టికెట్లు వంటి సేవలను వినియోగించుకోవాలని అరుణ్‌ కుమార్‌ జైన్‌ తెలిపారు. తక్కువ చార్జీలతో గమ్యస్థానానికి చేరుకోవడంలో ఎమ్‌ఎమ్‌టీఎస్‌ అత్యుత్తమ రవాణా వ్యవస్థ అని ఆయన చెప్పుకొచ్చారు.

Also Read: PM Narendra Modi: ఏలూరు ఫ్యాక్టరీ ప్రమాదంపై ప్రధాని మోడీ విచారం.. మృతుల కుటుంబాలకు సంతాపం

Alia Ranbir Wedding: ఆలియా రణబీర్ ఇంట్లో మొదలైన పెళ్లి సందడి.. ఎట్టకేలకు ఫోటోస్ షేర్ చేసిన హీరోయిన్..

Bandi Sanjay: ఇవాళ్టి నుంచి ప్రజా సంగ్రామం.. అలంపూర్ నుంచి బండి సంజయ్ పాదయాత్ర..