Holiday Special Trains: వేసవి సెలవుల కారణంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా సొంతూళ్లకు వెళ్లేవారు, పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలకు వెళ్లే ప్రయాణికులతో రైళ్లన్నీ నిండుగా కనిపిస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) సమ్మర్ స్పెషల్ రైళ్ల సంఖ్యను ఎప్పటికప్పుడు పెంచుతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలు, నగరాల మీదుగా మరికొన్ని స్పెషల్ ట్రైన్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా 02763 నంబర్ గల రైలు ఏప్రిల్ 17న తిరుపతి నుంచి సాయంత్రం 5 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. రేణిగుంట, శ్రీకాశహస్తి, వెంకటగిరి, గూడురు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట్, జనగామ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
విజయవాడ- హుబ్లి మధ్య..
ఇక విజయవాడ, కర్ణాటకలోని హుబ్లి స్టేషన్ల మధ్య కూడా మరో డైలీ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకురానుంది రైల్వేశాఖ. ఏప్రిల్ 20 నుంచి ఈ రైలు నడవనుంది. 17329 నంబర్ గల రైలు ఏప్రిల్20న హుబ్లి నుంచి 19.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 12.20 గంటలకు విజయవాడ చేరుతుంది. అదేరోజు 17330 గల రైలు విజయవాడ నుంచి 13.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 5.30 గంటలకు హుబ్లి చేరుకుంటుంది. మంగళగిరి, నంబూరు, గుంటూరు, నల్లపాడు, పెరిచెర్ల, నుదురుపాడు, నర్సారావుపేట, సంతమంగళూరు, సావల్యపురం, వినుకొండ, కురిచేడు, దొనకొండ, మార్కాపూర్ రోడ్, తర్లుపాడు, సోమిదేవిపల్లి, గిద్దలూరు, దిగువమెట్ట, గాజులపల్లి, నంద్యాల, పాణ్యం, బి.సిమెంట్‌నగర్, బేతంచర్ల, రంగాపురం, డోన్, మల్యాల, లింగనేనిదొడ్డి, పెండేకల్, తుగ్గలి, మద్దికెర, గుంతకల్, బంటనహాల్, బళ్లారి, కుడతిని, తోరనగల్లు, హోస్పేట, మునిరాబాద్, కొప్పల్, భాన్‌పూర్, గడగ్ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
Holiday Special Train #Tirupati – #Secunderabad @drmsecunderabad @drmhyb @drmgtl pic.twitter.com/zuSJbaebzh
— South Central Railway (@SCRailwayIndia) April 14, 2022
Introduction of Daily Express Train between #Hubballi – #Vijayawada @drmvijayawada @VijayawadaSCR @SWRRLY @drmubl pic.twitter.com/iMo2SUowgj
— South Central Railway (@SCRailwayIndia) April 14, 2022
Also Read: Ayurvedic Hospitals: ఆయుర్వేద దవాఖానాలకు సుస్తీ.. వైద్యులు లేక ఆగచాట్లు పడుతున్న రోగులు..!
CPI Narayana: సీపీఐ నారాయణకు సతీ వియోగం.. అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూత