
హైదరాబాద్ నగరం పరిధిలోని చర్లపల్లి- ఘట్‌కేసర్ రైల్వేట్రాక్ ఫ్యామిలీ సూసైడ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండు రోజుల క్రితం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయ రెడ్డి ఆమె ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.. ఈ ఘటన సంచలనంగా మారింది. అయితే.. విజయారెడ్డి పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం వెనుక కారణం ఒంటరితనమేనని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. భర్త ఉద్యోగరిత్యా దుబాయ్‌లో ఉండటం.. పిల్లలు హాస్టల్స్‌లో ఉండటంతో.. విజయారెడ్డి ఒంటరితనం భరించలేక ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటుందని భావిస్తున్నారు. ఇంకా విజయారెడ్డికి ఆర్థిక ఇబ్బందులు, గొడవలు లేవని బంధువులు పేర్కొంటున్నారు.
చర్లపల్లిలో రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయరెడ్డి, ఇద్దరు పిల్లలు విశాల్ రెడ్డి, చేతన రెడ్డితో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు.. ఈ కేసులో రైల్వేపోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. విజయరెడ్డి మొబైల్, ల్యాబ్‌టాప్ విశ్లేషిస్తున్నారు, ఆమె టీమ్‌లో పనిచేసే కొందరిని సైతం విచారించారు. భర్త సురేందర్ దుబాయ్ నుంచి వచ్చారు. ఆయన నుంచి వివరాలు సేకరించారు. ప్రాథమిక దర్యాప్తులో ఒంటరితనమే ఆత్మహత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు
అయితే.. సురేందర్‌రెడ్డి, విజయరెడ్డిలకు 2007లో వివాహమైంది. సురేందర్‌రెడ్డికి నాలుగేళ్ల క్రితం దుబాయ్‌లో ఉద్యోగం రావటంతో ఆయన అక్కడకు వెళ్లి జాబ్ చేస్తున్నారు. . రాఘవేంద్రనగర్‌లో తల్లి పుష్పలతతో కలిసి విజయరెడ్డి ఉంటున్నారు. ఇంజినీరింగ్ చదివిన విజయారెడ్డి.. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో టీమ్ లీడ్ గా పనిచేస్తున్నారు. పిల్లలు హాస్టల్ లో ఉంటున్నారు. అయితే.. జనవరి 31న.. ఆత్మహత్యకు ముందు.. బంధువు చనిపోయారని చెప్పి హాస్టల్ నుంచి పిల్లలను తీసుకొనివచ్చి రైల్వేస్టేషన్‌కు వెళ్లింది విజయరెడ్డి.. ఈ క్రమంలోనే పటాన్‌చెరు నుంచి అమ్మాయిని, ఘట్‌కేసర్ నుంచి కొడుకుని తీసుకుని వచ్చింది. తాను చనిపోవాలని అనుకుంటున్నట్టు కారులోనే పిల్లలకు చెప్పినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.. ఆ ముగ్గురూ స్టేషన్‌లో అరగంట పాటు అటుఇటు తిరిగినట్లు గుర్తించారు. ట్రైన్ వచ్చే సమయానికి ట్రాక్‌పై నిలబడి ఆత్మహత్య చేసుకున్నారు. తమ చావుకు ఎవరూ కారణం కాదంటూ విజయారెడ్డి పార్కింగ్ స్లిప్‌పై సూసైడ్ నోట్ రాశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..