Hyderabad Crime: సిటీ బస్సు బీభత్సం.. మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిన బస్సు.. ఆటో అడ్డు రావడంతో

|

Apr 14, 2022 | 7:38 AM

'ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం.. శుభప్రదం..' అనే నినాదం ఆచరణ సాధ్యం కావడం లేదు. ఆర్టీసీ బస్సుల్లో భద్రంగా ఇంటికి చేరుతామన్న భరోసా ప్రయాణికుల్లో కలగడం లేదు. తాజాగా హైదరాబాద్(Hyderabad) నగరంలో లోకల్...

Hyderabad Crime: సిటీ బస్సు బీభత్సం.. మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిన బస్సు.. ఆటో అడ్డు రావడంతో
Rtc Bus
Follow us on

‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం.. శుభప్రదం..’ అనే నినాదం ఆచరణ సాధ్యం కావడం లేదు. ఆర్టీసీ బస్సుల్లో భద్రంగా ఇంటికి చేరుతామన్న భరోసా ప్రయాణికుల్లో కలగడం లేదు. తాజాగా హైదరాబాద్(Hyderabad) నగరంలో లోకల్ బస్సు ప్రమాదానికి గురైంది. దిల్‌సుఖ్‌నగర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టింది. అజాగ్రత్తగా వెళ్తూ ఆటోను ఢీకొట్టింది. ఆటో డ్రైవర్‌ ఫిర్యాదు మేరకు మలక్‌పేట పోలీసులు ఆర్టీసీ(RTC) బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. మూసారాంబాగ్‌(Musarambagh) వద్ద మెట్రో పిల్లర్‌ నంబర్‌ ఏ1505, ఏ1506 మధ్య యూటర్న్‌ ఉంది. ఉదయం 9 గంటలకు కొత్తపేట నుంచి మూసారాంబాగ్‌ వెళ్లే ఓ ఆటో అక్కడ యూటర్న్‌ తీసుకొనేందుకు ప్రయత్నిస్తుండగా ఆర్టీసీ బస్సు వెనక నుంచి వచ్చి, ఆటోను ఢీకొని, అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ ఏ1504ను ఢీకొంది. బస్సు డ్రైవర్‌ శంకర్‌తోపాటు పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్సు దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి పటాన్‌చెరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పిల్లర్‌ను బస్సు ఢీకొట్టడంతో బస్సు కుడి భాగం ధ్వంసమైంది. డివైడర్‌ కూలిపోయింది. ఆటోలో ఉన్న ప్రయాణికుడు శ్రీనివాస్‌కు గాయాలయ్యాయి.

హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న సిటీ బస్సుల్లో 30 శాతం కాలం చెల్లినవే ఉన్నాయని, వాటికే మరమ్మతులు చేసి రోడ్డు మీదకు తీసుకువస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఓ ఆర్టీసీ అధికారి తెలిపారు. నగరంలో తిరుగుతున్న 2,800 బస్సుల్లో 40 వాహనాలకు టెయిల్‌ ల్యాంప్సే లేవు. ఉన్న బస్సుల్లో వాటిని డ్రైవర్లు ఉపయోగించడం లేదు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

Also Read

Ambedkar Jayanti 2022: అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం.. హక్కుల కోసం గొంతెత్తిన స్వరం.. భీమ్‌రావ్ అంబేద్కర్

Indian Railways: రైల్వే ప్రయాణికులకు పెద్ద ఉపశమనం.. కీలక ప్రకటన చేసిన ఇండియన్ రైల్వే శాఖ..!

APSRTC: డీజిల్ సెస్ పేరుతో ‘బాదుడే బాదుడు’.. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై భగ్గుమన్న విపక్షాలు