డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌.. ఇకపై జరిమానాతో పాటు ఆ శిక్ష కూడా .!

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో కోర్టు వినూత్న తీర్పు ఇచ్చింది. మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తికి రూ.6 వేల జరిమానాతో పాటు ఒక రోజు రోడ్డుపై నిలబడి ట్రాఫిక్‌ డ్యూటీ చేయాలని ఆదేశించింది . 

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌.. ఇకపై జరిమానాతో పాటు ఆ శిక్ష కూడా .!
Drunk And Drive

Edited By:

Updated on: Aug 31, 2026 | 10:26 PM

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో కోర్టు వినూత్న తీర్పు ఇచ్చింది. మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తికి రూ.6 వేల జరిమానాతో పాటు ఒక రోజు రోడ్డుపై నిలబడి ట్రాఫిక్‌ డ్యూటీ చేయాలని ఆదేశించింది. యాచారం మండల కేంద్రంలోని బస్‌స్టాప్‌ వద్ద శుక్రవారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇబ్రహీంపట్నం మండలం ఖానాపురం గ్రామానికి చెందిన ప్రైవేట్‌ డ్రైవర్‌ సుందర్‌రావు మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఇబ్రహీంపట్నం కోర్టులో హాజరుపరిచారు.

కేసును విచారించిన స్పెషల్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ సుజాత.. మోటార్‌ వెహికల్స్‌ యాక్ట్‌ సెక్షన్‌ 185(ఏ) కింద నేరం రుజువైనట్లు నిర్ధారించారు. నిందితుడికి రూ.6 వేల జరిమానా విధించడంతో పాటు ఒక రోజు రోడ్డుపై నిలబడి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని ఆదేశించారు.

కోర్టు ఆదేశాల మేరకు యాచారం పోలీసులు సుందర్‌రావుతో ఒకరోజంతా ట్రాఫిక్‌ డ్యూటీ చేయించారు. ఈ సందర్భంగా యాచారం పోలీస్‌ స్టేషన్‌ సీఐ నందీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల డ్రైవర్‌ ప్రాణాలకే కాకుండా రోడ్డుపై ప్రయాణించే అమాయక ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌కు పాల్పడి పట్టుబడితే ఎంతటి వారిపైనైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us