నాంపల్లి కోర్టులో ప్రజాప్రతినిధుల కేసుల విచారణ… కోర్టు ధిక్కరణ కేసులో ఎమ్మెల్యే సీతక్కకు నాన్ బెయిలబుల్ వారెంట్

|

Feb 05, 2021 | 10:31 PM

ఓ కేసుకు సంబంధించి కోర్టులో విచారణకు హాజరుకాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.

నాంపల్లి కోర్టులో  ప్రజాప్రతినిధుల కేసుల విచారణ... కోర్టు ధిక్కరణ కేసులో ఎమ్మెల్యే సీతక్కకు నాన్ బెయిలబుల్ వారెంట్
Follow us on

కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఓ కేసుకు సంబంధించి కోర్టులో విచారణకు హాజరుకాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఈనెల 9లోగా సీతక్కపై వారెంట్‌ను అమలు చేయాలని ములుగు పోలీసులను కోర్టు ఆదేశించింది.

నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో పలు కేసుల విచారణ జరిగింది. హెరిటేజ్ దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఏపీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు హాజరయ్యారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిరుమర్తి లింగయ్య, పొన్నం ప్రభాకర్, కంచర్ల భూపాల్ రెడ్డి, పి.చంద్రశేఖర్, కాశీపేట లింగయ్య, జాజల సురేందర్‌లు కోర్టుకు హాజరయ్యారు.

కాగా, వేర్వేరు కేసుల్లో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డికి కోర్టు సమన్లు పంపింది. అలాగే టీడీపీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావుపై మూడు కేసులను ప్రత్యేక కోర్టు కొట్టివేసింది.

ఇది చదవండి… తెలంగాణలో రెండో దశ కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు.. రేపటి నుంచి పోలీసులకు వ్యాక్సిన్..!