Hyderabad: మందుబాబులకు అలెర్ట్.. తాగి వాహనం నడిపితే రూ.10 వేల ఫైన్
నయాసాల్ వేడుకలకు హైదరాబాద్ సిటీ ముస్తాబైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో పోలీసులు అలెర్ట్ అయ్యారు.

2022కు గుడ్ బై చెప్పి.. న్యూ ఇయర్‌కు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు హైదరాబాద్ సిటిజన్స్ సిద్దమయ్యారు. ఈ క్రమంలో మూడు కమిషనరేట్ల పరిధిలోని పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు ముందస్తు ప్రణాళికలు రెడీ చేశారు. ముఖ్యంగా డ్రంకంన్ డ్రైవ్‌పై ఫోకస్ పెట్టారు. తాగి డ్రైవ్ చేస్తే.. జైల్లో వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేసినా కేసులు తప్పవన్నారు. డిసెంబరు 31 నైట్ నుంచి జనవరి 1 ఉదయం వరకూ అన్ని ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నట్టు అనౌన్స్ చేశారు. శనివారం మిడ్ నైట్ నుంచి బేగంపేట్, లంగర్‌హౌస్ మినహా అన్ని ఫ్లై ఓవర్స్‌పై రాకపోకలు నిలిపివేయనున్నారు.
డ్రంకన్ డ్రైవ్‌లో దొరికిపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాసరావు వార్నింగ్ ఇచ్చారు. ఫస్ట్ టైమ్ చిక్కితే రూ.10,000 ఫైన్, 6 నెలల జైలు శిక్ష ఉండొచ్చన్నారు. రెండోసారైతే రూ.15,000 ఫైన్, 2 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అంతేకాదు ఇలా దొరరికిన వారి డ్రైవింగ్ లైసెన్స్ సీజ్ చేసి సస్పెన్షన్ కోసం ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌కు పంపుతామన్నారు. ఫస్ట్ టైమ్ 3 నెలల సస్పెన్షన్, సెకండ్ టైమ్ పట్టుబడిన వారి లైసెన్స్ పర్మనెంట్‌గా క్యాన్సిల్ చేస్తామన్నారు. వాహనదారులు రూల్స్ పాటించి సహకరించాలని డీసీపీ సూచించారు.
న్యూ ఇయర్ వేడుకల వేళ.. రాచకొండ పోలీసులు డ్రగ్స్ పై నిఘా పెట్టారు. నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ డ్రగ్స్ పెడ్లర్ల ఆట కట్టిస్తున్నారు. డ్రగ్స్ రవణా చేసేవారిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామన్నారు. NDPS యాక్ట్ మోస్ట్ పవర్ఫుల్ అని… ఈ యాక్ట్ కింద ఒకటికన్నా ఎక్కువ సార్లు నేరాలకు పాల్పడితే.. ఉరిశిక్ష పడే ఛాన్సు కూడా ఉందన్నారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..