బల్దియా బాద్‌షాపై కొనసాగుతున్న ఉత్కంఠ.. సీల్డు కవర్‌లో మేయర్, డిఫ్యూటీ మేయర్ పేర్లు..

|

Feb 07, 2021 | 6:20 PM

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిఫ్యూటీ మేయర్ ఎన్నికపై లెక్క తేలింది. మేయర్‌ను ఎంపిక చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారి పేర్లను సీల్డు కవర్‌లో ఉంచారు.

బల్దియా బాద్‌షాపై కొనసాగుతున్న ఉత్కంఠ.. సీల్డు కవర్‌లో మేయర్, డిఫ్యూటీ మేయర్ పేర్లు..
Follow us on

GHMC Mayor : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిఫ్యూటీ మేయర్ ఎన్నికపై లెక్క తేలింది. ఆదివారం తెలంగాణభవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అభ్యర్థులను ఖరారు చేసింది. మేయర్‌ను ఎంపిక చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారి పేర్లను సీల్డు కవర్‌లో ఉంచారు.

ఈనెల 11న జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం జరుగనుంది. అదే రోజు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం బల్దియా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మేయర్‌ ఎన్నికలకు ఎక్స్‌అఫీషియో సభ్యులు కార్పొరేటర్లతో కలిసి జీహెచ్‌ఎంసీకి వెళ్లాలని సీఎం సూచించారు. జీహెచ్‌ఎంపీ మేయర్‌ అభ్యర్థిని ఎన్నిక రోజే సీల్డ్‌ కవర్‌ ద్వారా తెలియజేస్తామని వెల్లడించారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ అభ్యర్థుల పేర్లు సీల్డ్‌ కవర్‌ ద్వారా కార్పొరేటర్లకు అందిస్తామని, కార్పొరేటర్లు జీహెచ్‌ఎంసీలోనే కవర్లు తెరచి పార్టీ బలపరిచిన అభ్యర్థికే ఓటు వేయాలని సీఎం కేసీఆర్‌ సూచించారు.

ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, జెడ్పీ చైర్ పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, డిసిసిబి అధ్యక్షులు, డిసిఎంఎస్ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Read Also… CM KCR: “10 ఏళ్ల వరకు నేనే సీఎంగా ఉంటా”.. సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన.. ఊహాగానాలకు చెక్