మూడు చెట్లు నరికినందకు.. రూ.39వేల జరిమానా!

|

Aug 13, 2019 | 6:55 PM

హైదరాబాద్‌: అటవీశాఖ అనుమతి లేకుండా చెట్లు నరికిన ఓ భవన యజమానికి అధికారులు భారీ జరిమానా విధించారు. హైదరాబాద్‌లో  జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లో ఓ భవన యజమాని అటవీ అధికారుల అనుమతి లేకుండా మూడు చెట్లు నరికారు. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన అధికారులు ఆ యజమానికి రూ.39060లు జరిమానా విధించారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఎదురుగా ఓ […]

మూడు చెట్లు నరికినందకు.. రూ.39వేల జరిమానా!
Fine For Cutting Trees
Follow us on

హైదరాబాద్‌: అటవీశాఖ అనుమతి లేకుండా చెట్లు నరికిన ఓ భవన యజమానికి అధికారులు భారీ జరిమానా విధించారు. హైదరాబాద్‌లో  జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లో ఓ భవన యజమాని అటవీ అధికారుల అనుమతి లేకుండా మూడు చెట్లు నరికారు. దీనిపై ఆగ్రహం వ్యక్తంచేసిన అధికారులు ఆ యజమానికి రూ.39060లు జరిమానా విధించారు.

వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఎదురుగా ఓ భారీ బిల్డింగ్ నిర్మిస్తున్నారు. నిర్మాణంలో భాగంగా చెట్లు అడ్డంపడుతున్నాయంటూ బిల్డింగ్ ఓనర్ మూడు చెట్లను అడ్డంగా నరికించేశారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. మూడు చెట్లు నరికినట్టు తేలడంతో గత నెల 7న ఆ యజమానికి రూ.39060లు జరిమానా విధించారు. దీంతో ఆయన ఈ నెల 9న జరిమానా చెల్లించారు.