Hyderabad News:హైదరాబాద్‌ వాసులకు శుభవార్త.. నగరంలో మరో అతి పెద్ద మాల్..

హైదరాబాద్‌లో ఇప్పటికే ఇనార్బిట్, లూలూ మాల్ లాంటివి అనేక పెద్ద మాల్స్ ఉన్నాయి. అయితే త్వరలో నగరంలోనే అతి పెద్ద మాల్ ఒకటి రానుంది. కూకట్‌పల్లిలో లేక్‌షోర్ మాల్ త్వరలో అందుబాటులోకి రానుంది. విస్తీరణంలో ఈ మాల్ నగరంలోనే అతి పెద్దదిగా చెబుతున్నారు.

Hyderabad News:హైదరాబాద్‌ వాసులకు శుభవార్త.. నగరంలో మరో అతి పెద్ద మాల్..
Lakeshore Mall

Updated on: Dec 09, 2025 | 8:26 PM

హైదరాబాద్‌లో ఇప్పటికే అనేక పెద్ద మాల్స్ ఉన్న విషయం తెలిసిందే. అన్నీ ఒకేచోట లభించేలా లూలూ మాల్ కూడా కూకట్‌పల్లిలో అందుబాటులో ఉంది. అయితే త్వరలో మాల్ కూడా నగరంలో రానుంది. అదే లేక్‌షోర్ షాపింగ్ మాల్. కూకట్‌పల్లిలో ఏర్పాటు కానున్న ఈ మాల్.. నగంలోనే అతిపెద్ద మాల్‌గా నిలవనుందని చెబుతున్నారు. ఇందులో అన్నీ ఒకేచోట లభించనున్నాయి. షాపింగ్, గేమ్స్, మూవీస్, ఫుడ్ లాంటివి ఒకేచోట అందుబాటులో ఉండమే కాకుండా ప్రజలు సులువుగా చేరుకునేలా మెట్రో స్టేషన్‌తో అనుసంధానం చేయనున్నారు. ఇప్పటికే కూకట్‌పల్లిలో భారీ విస్తీర్ణంలో ఈ మాల్ నిర్మాణం దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఈ నెలలోనే ఈ మాల్‌ను ప్రారంభించనున్నారని తెలుస్తోంది.

1.66 మిలియన్ చదరపు విస్తీర్ణం

ఈ లేక్‌షోర్ మాల్‌ను దాదాపు 1.66 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఇనార్బిట్ మాల్ కంటే రెట్టింపు మారిమాణంలో ఇది ఉంటుంది. ఈ మాల్‌లో మొత్తం 100కిపైగా షాపులు ఉంటాయి. ఫుడ్, ఫ్యాషన్, టెక్, లైఫ్‌స్ట్రైల్‌కి జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ బ్రాండ్ల షోరూమ్‌లన్నీ అందుబాటులో ఉంటాయి. ఇక సినిమా థియేటర్ల విషయానికొస్తే.. పీవీఆర్ మాల్ ప్రీమియం P[XL] ఫార్మాట్ ధియేటర్లను తీసుకొస్తుంది. ఈ ఫార్మట్‌లో మొదటి స్క్రీన్ ఇనార్బిట్ మాల్‌లో ఉండగా.. ఇది రెండోదిగా తెలుస్తోంది.

బాలానగర్ మెట్రో స్టేషన్ నుంచి నేరుగా..

హైదరాబాద్‌లో పలుమార్లు మెట్రో స్టేషన్‌కు అనుసంధానంగా ఉన్నాయి. మెట్రో స్టేషన్ దిగకుండానే నేరుగా ఈ మాల్స్‌లోకి వెళ్లొచ్చు. నగరంలో పలుచోట్ల ఇలాంటి మాల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు లేక్‌షోర్ మాల్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. బాలానగర్ మెట్రో స్టేషన్ నుంచి నేరుగా మాల్‌లోకి ఎంట్రీ ఇవ్వొచ్చు. అయితే మాల్ వల్ల కూకట్‌పల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశముందని స్ధానికులు ఆందోళన వ్యక్తం చేస్తు్న్నారు. ఇప్పటికే లూలూ మాల్ వల్ల అక్కడి స్ధానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఈ కొత్త మాల్ రాకతో సమస్య తీవ్రతరం అవుతుందని అంటున్నారు. ఇప్పటికే కూకట్‌పల్లిలో అనేక షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అంతేకాకుండా విద్యార్థులు, ఉద్యోగులు అక్కడ ఎక్కువగా నివసిస్తున్నారు. దీని వల్ల వీకెండ్స్‌లో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.