
హైదరాబాద్, జూలై 24: ఎల్‌నినో పుణ్యమాని మధ్య తరగతి కుటుంబాలపై అధిక ధరలు మోయలేని విధంగా భారంగా మారాయి. బియ్యం మొదలుకుని పప్పులు, ఉప్పులు, కూరగాయల ధరలు నానాటికీ ఆకాశానికి ఎగబాకుతున్నాయి. ఈ క్రమంలో కూకట్‌పల్లిలోని మోడర్న్ అండ్ మోడల్ రైతు బజార్ శుక్రవారం (జులై 24) కూరగాయల ధరల జాబితాను విడుదల చేసింది. ఇందులో కొన్ని నిత్యావసర కూరగాయల ధరలు వినియోగదారులకు అందుబాటులో ఉండగా.. మరికొన్ని కూరగాయలు, మసాలా దినుసులు మాత్రం అధిక ధరలకు విక్రయిస్తున్నారు. రైతు బజార్‌లో రోజువారీగా ధరలను నిర్ణయించి విక్రయాలు నిర్వహిస్తున్నారు. దేని ధర ఏ స్థాయిలో ఉందో ఈ కింద తెలుసుకోండి..
టమాట కిలో రూ.18, వంకాయ రూ.23, బెండకాయ రూ.35, పచ్చిమిర్చి రూ.40, బజ్జి మిర్చి రూ.50గా నిర్ణయించారు. అలాగే ఆలుగడ్డ కూడా కిలో రూ.18కే లభిస్తోంది. సొరకాయ రూ.15, దోసకాయ రూ.18, బీరకాయ రూ.32, కాకరకాయ రూ.23, క్యాబేజీ రూ.23, కాలీఫ్లవర్ రూ.25, క్యారెట్ రూ.41గా ఉంటే.. ఇక బీన్స్ రూ.55, చిక్కుడుకాయ రూ.45, గోరుచిక్కుడు రూ.32, బీట్‌రూట్ రూ.33, క్యాప్సికం రూ.50, కంద రూ.45, ఉల్లిపాయ రూ.34, ఉల్లిపొరక రూ.55కు విక్రయిస్తున్నారు. మామిడికాయ ఒక్కటి రూ.15 నుంచి 20 వరకు పలుకుతుంది. కూర అరటికాయ రూ.9 నుంచి10, ముల్లంగి ఒక్కటి రూ.6 నుంచి 8, మునగకాయ ఒక్కటి రూ.6 నుంచి 8గా ధర నిర్ణయించారు. ఇక మసాలా దినుసుల ధరలు చుక్కల్లోకి ఎగబాకాయి. ఎండుమిర్చి, వెల్లుల్లి కిలో రూ.260, పాత అల్లం రూ.200, చింతపండు రూ.160, పండు మిర్చి రూ.80, ఉసిరి రూ.100, పల్లీలు రూ.75గా ఉన్నాయి. పుట్టగొడుగులు (200 గ్రాములు) రూ.45, బొప్పాయి రూ.40, గుమ్మడికాయ రూ.40, చిలగడదుంప రూ.40కు విక్రయిస్తున్నారు.
గమనిక: ఇవి జులై 24, 2026వ తేదీన కూకట్‌పల్లి మోడర్న్ అండ్ మోడల్ రైతు బజార్ విడుదల చేసిన కూరగాయలు, నిత్యవసర సరుకుల ధరలు. రోజువారీ సరఫరా, డిమాండ్‌ను బట్టి వీటి ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.