తలను నరికిన తర్వాత కూడా పాము కాటు వేస్తుందా?

Samatha

16 september 2026

Pic credit - Pinterest

పాములకు సంబంధించిన  ఏ న్యూస్ అయినా సరే ఇట్టే వైరల్ అవుతుంటుంది. అంతే కాకుండా వీటికి సంబంధించిన అనేక వార్తలు వస్తుంటాయి.

పాములు

 మనం చాలా సార్లు వినే  ఉంటాం, పామును కట్టెతో చంపిన తర్వాత కూడా కాటు వేసిందని, దీని వలన మరణించిన వారు కూడా ఉన్నారు.

చనిపోయిన తర్వాత కాటు వేయడం

అయితే పామును చంపిన తర్వాత మాత్రమే కాదంట, పాము తలను నరికి వేసిన తర్వాత కూడా అది కాటు వేసే ప్రమాదం ఉన్నదంట.

తలను వేరుచేయడం

కాగా, ఇప్పుడు మనం పాము తలను నరికిన తర్వాత కూడా నిజంగా కాటు వేస్తుందా? ఇది ప్రాణానికి ముప్పో కాదో తెలుసుకుందాం.

తలను నరికిన తర్వాత కాటు

పాము తల నరికిన వెంటనే అది పూర్తిగా తన ప్రాణాలు విడుస్తుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు అంటున్నారు నిపుణులు.

కాటు వేయడం

పాము తలను తన శరీరం నుంచి వేరు చేసిన తర్వాత కూడా కొంత సమయం వరకు పాము చాలా చురుకుగా ఉంటుందంట. కొన్ని సందర్భాల్లో తెగిపోయిన తల కూడా కొన్ని నిమిషాల పాటు ప్రాణంతో ఉంటుందంట.

చురుకుదనం

అది తన నోటితో కొరికి పట్టుకోవడం కాటు వేసే ప్రమాదం కూడా ఉంటుంది. పాములు శీతల రక్త జీవులు కాబట్టి వాటి నరాల ప్రతి చర్యలు వెంటనే ఆగిపోవంట.

కాటు వేసే ప్రమాదం

పాము మెదడుకు చాలా తక్కువ ఆక్సిజన్ అవసరం కాబట్టి, తల కొంతసేపు ప్రతి స్పందిస్తూ, కాటు వేసే ప్రమాదం ఉంది, విషం ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుందంట.

విష ప్రభావం ఎక్కువే