వినాయకుడి నిమజ్జనం తర్వాత ఎందుకు వెనక్కి తిరిగి చూడకూడదో తెలుసా?
Samatha
16 september 2026
Pic credit - Pinterest
వినాయక చవితి పండుగ అంటే ప్రతి ఒక్కరికీ చాలా ఇష్టం. తొమ్మిది రోజుల పాటు ప్రతి ఒక్కరూ ఆనందంగా గణేశ్ ఉత్సవాలను జరుపుకుంటారు.
వినాయక చవితి
ఉదయం, సాయంత్రం పూజకు వెళ్తూ, ఆ గణనాథుడిని భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటారు. భజనలు చేస్తూ ఆనందంగా గడుపుతారు.
భక్తిశ్రద్ధలు
అయితే వినాయక చవితి రోజు గణపతిని ఇంటికి ఆహ్వానించే రోజు ఎంత సందడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు.
వినాయక చవితి సందడి
అదే విధంగా వినాయకుడి నిమజ్జనం కూడా అంతే సందడిగా కొనసాగుతుంది. అయితే ఈ రోజు వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాత వెనక్కు తిరిగి చూడకూడదు అంటారు.
నిమజ్జనం
కాగా, ఇప్పుడు మనం అసలు వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాత ఎందుకు తిరిగి వెనకకు చూడకూడదో వివరంగా తెలుసుకుందాం.
వెనక్కీ తిరిగి చూడకూడదు
కొన్ని కథనాల ప్రకారం వినాయకుడిని జలసమర్పణ చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే, ఆయనకు వీడ్కోలు పలుకుతున్నప్పుడు కూడా మనసులో అనుబంధం అలాగే కొనసాగుతుందంట.
బంధం
అంతే కాకుండా, గణేశుడు ఇంటి నుండి వెళ్ళిపోయినప్పుడు, ఇంట్లోని అన్ని కష్టాలను, ఇబ్బందులను, ప్రతికూల శక్తులను, అడ్డంకులను తనతో పాటు తీసుకుపోతాడని నమ్ముతారు.
ప్రతికూల శక్తులు
అందువలన ఆయనను నిమజ్జనం చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడటం వలన వాటన్నింటిని వదిలి సానుకూలంగా రావాలి అని అర్థం.