Hyderabad: ఇంత వైలెంట్‌గా ఉన్నావేంట్రా.. రూ.500 కోసం మేనేజర్‌ని దారుణంగా..

హైదరాబాద్‌ నగరంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కత్తిపోట్ల కలకలం రేగింది. పిల్లర్ నంబర్ 1482 దగ్గర ఉన్న వారాహి కన్సల్టెన్సీలోకి ఒక్కసారిగా చొరబడిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మేనేజర్ శశికిరణ్ రెడ్డి, ట్రైనర్ లయపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శశికిరణ్‌రెడ్డి చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలుస్తోంది.

Hyderabad: ఇంత వైలెంట్‌గా ఉన్నావేంట్రా.. రూ.500 కోసం మేనేజర్‌ని దారుణంగా..
Hyderabad Murder

Updated on: Mar 10, 2026 | 6:50 PM

హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పిల్లర్ నంబర్ 1482 దగ్గర ఉన్న ఓ కన్సల్టెన్సీలోకి దూరిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆ కన్సల్టెన్సీ మేనేజర్‌పై కత్తులతో దాడి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మేనేజర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. బాధితుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. శశికిరణ్‌రెడ్డి అనే వ్యక్తి పిల్లర్ నంబర్ 1482 దగ్గర వారాహి కన్సల్టెన్సీని రన్ చేస్తున్నాడు. అయితే ప్రభు కుమార్ అనే వ్యక్తి ఇటీవల జాబ్‌ కోసం వారాహి కన్సల్టెన్సీని సంప్రదించారు. ఇందుకోసం రూ. 2000 డిపాజిట్‌ చేశాడు. కానీ ఎంతకీ జాబ్‌ రాకపోవడంతో డబ్బు తిరిగి ఇవ్వాలని ప్రభు కుమార్ కంపెనీ నిర్వాహకులను నిలదీశాడు. అయితే సదరు సంస్ధ అతనికి 1500 ఆన్‌లైన్‌ చేశారు. మిగతా 500 తర్వాత ఇస్తామని చెప్పారు. కానీ నిందితుడు 500 కూడా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఇరువురి మధ్య గొడవ చెలరేగింది.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రభు కుమార్ తన వెంట తెచ్చుకున్న కత్తితో మేనేజర్ శశికిరణ్‌రెడ్డి, ట్రైనర్ లయపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శశికిరణ్ రెడ్డి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించగా.. ట్రైనర్ లయ ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకన్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us