Vande Bharat Express: గుడ్ న్యూస్.. పట్టాలెక్కనున్న మరో వందేభారత్ ట్రైన్.. ఎక్కడనుంచంటే?

|

Dec 07, 2022 | 12:58 PM

Vande Bharat Express: సెమీ హైస్పీడ్ ట్రైన్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ మరికొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టనుంది. ఇప్పటికే దక్షిణ భారతదేశంలో మొదటి ట్రైన్ చెన్నై-మైసూరు..

Vande Bharat Express: గుడ్ న్యూస్.. పట్టాలెక్కనున్న మరో వందేభారత్ ట్రైన్.. ఎక్కడనుంచంటే?
Vande Bharat Express
Follow us on

సెమీ హైస్పీడ్ ట్రైన్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ మరికొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టనుంది. ఇప్పటికే దక్షిణ భారతదేశంలో మొదటి ట్రైన్ చెన్నై-మైసూరు వయా బెంగళూరు మీదుగా పట్టాలెక్కగా.. 2023 న్యూఇయర్ నాటికి రెండో ట్రైన్ సికింద్రాబాద్-విజయవాడ మార్గం మధ్య పరుగులు పెట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. దేశంలోని ఆరో సెమీ-హైస్పీడ్ వందేభారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 11న నాగ్‌పూర్‌లో ప్రారంభించనున్నారు. దీనిపై రైల్వేశాఖ ఇప్పటికే కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ ట్రైన్ బిలాస్‌పూర్ – నాగ్‌పూర్ మధ్య పరుగులు పెట్టనుంది. ఆదివారం మినహా వీక్‌ డేస్‌లో ఈ వందేభారత్ రైలు నడవనుంది.

“ఈ రైలు బిలాస్‌పూర్ నుంచి ఉదయం 6.45 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటుంది. అదేవిధంగా, నాగ్‌పూర్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి రాత్రి 7.35 గంటలకు బిలాస్‌పూర్ చేరుకుంటుంది. ప్రస్తుతం ఉన్న సూపర్‌ఫాస్ట్ రైళ్లు బిలాస్‌పూర్ నుంచి నాగ్‌పూర్ చేరుకోవడానికి దాదాపు ఏడు గంటల సమయం పడుతుండగా, ఈ రైలు దాదాపు ఐదున్నర గంటల్లోనే ఆ దూరాన్ని పూర్తి చేస్తుంది” అని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఈ ట్రైన్‌ రాయ్‌పూర్, దుర్గ్, గోండియా స్టేషన్లలో ఆగుతుంది.

మరోవైపు 2023లో సికింద్రాబాద్-విజయవాడ మధ్య మరో వందేభారత్ రైలును ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికైతే ట్రాక్ టెస్టింగ్ జరుగుతోంది. ఒకవేళ అన్ని అనుకున్న సమయానికి జరిగి న్యూఇయర్ నాటికి దక్షిణ భారతదేశంలో పరుగులు పెట్టనున్న రెండో సెమీ హైస్పీడ్ రైలు ఇదే అవుతుంది. కాగా, ఈ వందేభారత్ రైలును ఈ ఏడాది అక్టోబర్‌లో ముంబై-అహ్మదాబాద్ మార్గంలో తొలిసారిగా ప్రధాని మోదీ ప్రారంభించారు. వచ్చే ఏడాది ఆగష్టు నాటికి 75 వందేభారత్ రైళ్లను ప్రారంభించాలని కేంద్ర రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. వందేభారత్ రైలులోని అన్ని కోచ్‌లలో ఆటోమేటిక్ డోర్లు, GPS-ఆధారిత ఆడియో-విజువల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, వినోద ప్రయోజనాల కోసం ఆన్‌బోర్డ్ హాట్‌స్పాట్ Wi-Fi, సౌకర్యవంతమైన సీట్లు ఉన్నాయి.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం..