Hyderabad: మియాపూర్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి..

హైదరాబాద్‌‌లోని మియాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటన మియాపూర్‌లోని మక్తా మహబూబ్‌పేటలో జరిగింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Hyderabad: మియాపూర్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి..
Crime News

Updated on: Aug 21, 2025 | 11:23 AM

హైదరాబాద్‌‌లోని మియాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. వీరంతా ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటన మియాపూర్‌లోని మక్తా మహబూబ్‌పేటలో జరిగింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుల వివరాలు సేకరించారు. మృతులు నర్సింహ (60), వెంకటమ్మ (55), అనిల్ (32), కవిత (24), అప్పు (2)గా పోలీసులు నిర్ధారించారు. కర్ణాటక గుల్బర్గాకు చెందిన నర్సింహ కుటుంబం గత కొంత కాలం నుంచి హైదరాబాద్ లో నివసిస్తోంది.. నర్సింహకు ముగ్గురు కూతుర్లు.. కాగా.. నర్సింహా, అతని భార్య వెంకటమ్మ, రెండవ కూతురు, అల్లుడు, పాపతో మక్తా మహబూబ్‌పేటలో నివిసిస్తున్నాడు.. నర్సింహతోపాటు కుటుంబం మొత్తం కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది.

ఈ క్రమంలోనే వీరంతా బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ఘటనలో రెండవ కూతురు, అల్లుడు పాపతో సహా నర్సింహా.. అతని భార్య వెంకటమ్మ మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

వీరి ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలు కారణమా..? లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా..? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

అయితే.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించడం స్థానికంగా కలకలం రేపింది..

ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..