Kite Festival: మూడవ రోజు కైట్ ఫెస్టివల్‌లో ప్రత్యేక ఆకర్షణగా స్పెషల్ కైట్…

తెలంగాణ పర్యటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు సందడిగా సాగింది. మూడు రోజులపాటు సాగిన ఈ ఈవెంట్లో వివిధ రూపాలలో ఉన్న పతంగులు అందర్నీ ఆకర్షించాయి. మూడవ రోజు మాత్రం స్వామి వివేకానంద ఫోటోతో ఉన్న పెద్ద కైట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కర్ణాటక కు చెందిన కైట్ ప్లయర్స్ టీం వివిధ రూపాలతో..

Kite Festival: మూడవ రోజు కైట్ ఫెస్టివల్‌లో ప్రత్యేక ఆకర్షణగా స్పెషల్ కైట్...
Kite Festival

Edited By:

Updated on: Jan 15, 2024 | 12:49 PM

మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నగరవాసుల్ని ఆకట్టుకుంటుంది. శనివారం నుంచి సోమవారం వరకు జరిగిన ఈ ఈవెంట్ కి భారీ సంఖ్యలో విజిటర్స్ వచ్చారని పర్యటక శాఖ చెబుతోంది. గ్రౌండ్లో ఒకవైపు స్వీట్ ఫెస్టివల్ మరొకవైపు డిఫరెంట్ టైప్స్ లో ఉన్న కైట్స్ ఫెస్టివల్ అందరినీ ఆకట్టుకుంది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరినీ ఆకర్షించేలా కైట్ ప్లయర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ తో సందడి చేశారు. చివరి రోజైనా సోమవారం ప్రత్యేక ఆకర్షణగా కొన్ని కైట్స్ ఆకట్టుకున్నాయి.

తెలంగాణ పర్యటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు సందడిగా సాగింది. మూడు రోజులపాటు సాగిన ఈ ఈవెంట్లో వివిధ రూపాలలో ఉన్న పతంగులు అందర్నీ ఆకర్షించాయి. మూడవ రోజు మాత్రం స్వామి వివేకానంద ఫోటోతో ఉన్న పెద్ద కైట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కర్ణాటక కు చెందిన కైట్ ప్లయర్స్ టీం వివిధ రూపాలతో ఉన్న కొన్ని కైట్స్ ని ప్రత్యేకంగా ఎగరవేసి సందడి చేశారు. దేశ కీర్తిని ప్రపంచ నలుమూలల చాటి చెప్పిన మహనీయుల చరిత్ర, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు అందరికీ తెలిసేలా ఇలాంటి పెద్ద ఈవెంట్స్ లో ప్రదర్శిస్తామని కైట్ ప్లయర్స్ చెబుతున్నారు.

మూడోరోజు కైట్ ఫెస్టివల్ లో స్వామి వివేకానంద చిత్రపటంతో ఉన్న గాలిపటం తో పాటు రింగ్ కైట్, అమీబా కైట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. మూడు రోజుల కైట్ ఫెస్టివల్ లో ఆదివారం చాలామంది విజిటర్స్ వచ్చారని వాతావరణం బాగుండడంతో ఆదివారం సాయంత్రం కైట్స్ అన్ని గాలిలో సందడి చేశాయని కైట్ ప్లయర్స్ అంటున్నారు. ఎప్పటికప్పుడు గాలి గమనం మారుతుండడంతో చాలా కష్టంగా ఉందని.. కానీ ఈ ఫెస్టివల్ కి వచ్చే విజిటర్స్ కోసం కైట్స్ ఎగరేసేందుకు ప్రయత్నిస్తున్నామని కైట్ ప్లయర్స్ అంటున్నారు. వచ్చే సంవత్సరం నుండి హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాలో పర్యటకశాఖ ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ ఉంటుందని ప్రభుత్వం చెప్పడంతో ఈ రంగుల పండుగ ప్రభుత్వ ఆధ్వర్యంలో జిల్లాలకు విస్తరించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి