Raja Singh: హుస్సేన్ సాగర్‌లో కాకుండా ఎక్కడ నిమజ్జనం చేయాలో పోలీసులు చెప్పాలి: ఎమ్మెల్యే రాజాసింగ్

|

Sep 12, 2021 | 5:52 PM

హుస్సేన్ సాగర్‌లో కాకుండా గణేశ్ విగ్రహాల్ని ఎక్కడ నిమజ్జనం చేయాలో పోలీసులు చెప్పాలని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు.

Raja Singh: హుస్సేన్ సాగర్‌లో కాకుండా ఎక్కడ నిమజ్జనం చేయాలో పోలీసులు చెప్పాలి: ఎమ్మెల్యే రాజాసింగ్
Mla Raja Singh
Follow us on

Hussain Sagar – Ganesh Emersion: హుస్సేన్ సాగర్‌లో కాకుండా గణేశ్ విగ్రహాల్ని ఎక్కడ నిమజ్జనం చేయాలో పోలీసులు చెప్పాలని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ట్యాంక్ బండ్ మీద విగ్రహాల నిమజ్జనం చేయకూడదన్న పోలీసులు నోటీసులపై స్పందించిన గోషామహల్ ఎమ్మెల్యే.. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పేరుతో గణపతి భక్తులను భయాందోళనలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వేల సంఖ్యలో ఉన్న వినాయక విగ్రహాలు హుస్సేన్ సాగర్ లో కాకుండా ఎక్కడ నిమజ్జనం చేయాలో పోలీసులు చెప్పాలని ఆయన కోరారు.

“మీరు దారి చూపిన విధంగానే నిమజ్జనం చేస్తాము. ఇంత సడన్‌గా గణేష్ మండపాలకు ఆర్డర్ ఇస్తే కష్టమని ముఖ్యమంత్రికి తెలియదా.. సీఎం గాని పోలీసులు గాని నిమజ్జనానికి సరైన మార్గం చూపాలి. లేకపోతే ప్రగతి భవన్, డీజీపీ కార్యాలయం, పోలీస్ కమిషనర్ కార్యాలయం బయటే గణేష్ మండపం పెట్టాలని భక్తులకు సూచన.” అంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో సరైన వాదనలు వినిపించలేదని రాజాసింగ్ విమర్శించారు.

Read also: KTR: సింగరేణి కాలనీలో జరిగిన చిన్నారి రేప్ అండ్ మర్డర్ పై కేటీఆర్ తీవ్ర మనస్తాపం, హోంమంత్రి, డీజీపీకి ఆదేశాలు