Tree City: భాగ్యనగరానికి మరో అరుదైన గుర్తింపు.. రెండోసారి ట్రీ సిటీగా..

|

Apr 13, 2022 | 6:48 AM

Tree City of the World: విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ నగరానికి, మరో అరుదైన గుర్తింపు దక్కింది. తెలంగాణ ప్రభుత్వ కృషితోనే ఇది సాధ్యమైందన్నారు ఎంపీ సంతోష్‌కుమార్..

Tree City: భాగ్యనగరానికి మరో అరుదైన గుర్తింపు.. రెండోసారి ట్రీ సిటీగా..
Tree City
Follow us on

ప్రపంచంలోనే హైదరాబాద్ (Hyderabad)స్పెషల్‌గా నిలుస్తోంది. వరుసగా రెండోసారి ట్రీ సిటీగా(Tree City) ఎంపికైంది భాగ్యనగరం. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్, ఆర్బర్ డే ఫౌండేషన్ సంయుక్తంగా, ప్రపంచవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందిస్తున్న నగరాలను గుర్తించి, వాటిని ట్రీ సిటీస్‌గా ఎంపిక చేస్తాయి. అవి గుర్తించిన నగరాల్లో వరుసగా రెండోసారి చోటు దక్కించుకుంది హైదరాబాద్. రెండేళ్లకోసారి ట్రీ సిటీస్‌ను ఎంపిక చేస్తున్నారు. 2020లోనూ హైదరాబాద్ ట్రీ సిటీగా గుర్తింపు పొందింది. గత రెండేళ్లల్లో 3 కోట్ల 50 లక్షల 56 వేల 635 మొక్కలు నాటినట్టు ఆర్బర్ డే ఫౌండేషన్ వెల్లడించింది. తెలంగాణలో పచ్చనదనం పెంపుపై ప్రత్యేక శ్రద్ధపెట్టారు సీఎం కేసీఆర్. అటు ఎంపీ సంతోష్ కుమార్ ఓ ఉద్యమంలా చెట్లు నాటే కార్యక్రమాల్ని ప్రోత్సహిస్తున్నారు.

వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్‌ చేసి, హైదరాబాద్‌లో పచ్చదనం పెరిగేలా చేశారు. హైదరాబాద్‌లో తెలంగాణ సర్కార్ కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టింది. వీటిలో అత్యధికం హరితహారం ద్వారానే నాటారు. వాటిని సంరక్షించేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటోంది తెలంగాణ సర్కార్. పురపాలక మంత్రిగా పచ్చదనం విషయంలో స్పెషల్‌ కేర్‌ తీసుకున్నారు కేటీఆర్. పచ్చదనంపై స్పెషల్ టాస్క్ పెట్టుకొని కృషిచేశారు. దీంతో ఈ ఫలితం సాధ్యమైంది.

హైదరాబాద్​ వరుసగా రెండోసారి ట్రీసిటీగా గుర్తింపు పొందడంపై హర్షం వ్యక్తం చేశారు ఎంపీ సంతోష్ కుమార్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా, మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. ఇదే స్పూర్తితో భవిష్యత్తులోనూ పనిచేస్తామని చెప్పారు. తెలంగాణలో ఒక్క హైదరబాద్‌నే కాకుండా, ప్రతీ నగరాన్ని, పట్టణాన్ని పచ్చగా మార్చేందుకు కృషి చేస్తున్నట్టు వెల్లడించారు ఎంపీ సంతోష్‌కుమార్.

ఇవి కూడా చదవండి: Bandi Sanjay: వచ్చే ఎన్నికల్లో నా టికెట్‌పై కూడా స్పష్టత లేదు.. బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!