
భాగ్యనగరం ఇవాళ పెనువిషాదంలో కూరుకుంది. తెల్లవారుతూనే మరణ మృదంగం అందరినీ దిగ్భ్రాంతి పరిచింది. చిన్నారులు, వృద్ధులు అగ్నికీలల్లో బలయ్యారు. చార్మినార్‌కు కూతవేటు దూరంలోని జరిగిన మృత్యుఘోష అందరినీ కలచివేసింది. మీర్‌చౌక్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 17కు చేరుకుంది. మృతుల్లో నలుగురు పిల్లలు, ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉండగా, స్పాట్‌లోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
అలాగే మలక్‌పేట యశోదలో చికిత్స పొందుతూ మరో ఐదుగురు మృతి చెందారు. కంచన్‌బాగ్ అపోలోలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ రెండు చోట్ల నుంచి 10 మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గుల్జార్ హౌస్ సమీపంలో ఉన్న భవనంలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చేరుకుని పరిశీలించారు.
ఈ సందర్భంగా కృష్ణ పెరల్స్, మోడీ పెరల్స్ షాప్‌లతోపాటు అదే భవనంలో వెనుక ఉన్న ఇళ్లకూ మంటలు భారీగా వ్యాపించాయి. ముత్యాల వ్యాపారితోపాటు పనిచేసేవారి కుటుంబాలూ అక్కడే ఉన్నాయి. ముందు భాగంలో షాప్‌లు.. వెనుక నివాసాలు ఉన్నాయి. ఎంట్రీ, ఎగ్జిట్ ఒకటే ఉండడంతో తప్పించుకునే వీల్లేని పరిస్థితి నెలకొంది. దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక ఎక్కువ మరణాలు సంభవించాయని తెలుస్తోంది. ఇప్పటికే 17 మంది మృతి చెందగా, మరో ఐదుగురి పరిస్థితి విషమం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా ఇరుకైన గల్లీల వల్లే రెస్య్కూ ఆపరేషన్‌కు ఆలస్యమైందని తెలుస్తోంది. పాత భవనాలు కావడంతో ఫైర్ సెఫ్టీ అనేవి ఎక్కడ కూడా లేవు. 10 ఫైరింజన్లు వచ్చినా మంటలు ఆర్పడానికి ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. అప్పటికే G+1 భవనం మొత్తాన్ని మంటలు కమ్మేశాయి. భవనం గోడలు పగలగొట్టి లోపలికి వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. దట్టమైన పొగతో ఊపిరాడక 17మంది మృత్యువాత పడ్డారు. మరో ఐదుగురి పరిస్థితి విషమం ఉండగా, వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భవనంలో 8 కుటుంబాలకు చెందిన 30 మంది నివాసం ఉంటున్నారు. తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: RBI New Notes: మార్కెట్లోకి మరో కొత్త నోట్లు.. రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి