హైదరాబాద్(Hyderabad) నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఏర్పాటైన మెట్రో(Metro).. సకాలంలో ప్రజల మన్ననలు అందుకుంది. అయితే రాత్రి సమయాల్లో 10వరకే మెట్రో అందుబాటులో ఉండటంతో నగరవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో విధులు ముగించుకుని ఇంటికి చేరుకునేందుకు ఆ సమయాల్లో మెట్రో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో నడిపించాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. వేసవి కాలం, రంజాన్ సీజన్ కావడంతో రాత్రిపూట నగరంలో రద్దీ(Rush in Metro) ఎక్కువగా ఉంటుంది. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఉదయం 6 గంటలకే మెట్రో ప్రారంభించారు. ఇదే విధానంలో కనీసం అర్ధరాత్రి 12 గంటల వరకైనా మెట్రో ప్రయాణం అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. మెట్రోలో ఏసీ సర్వీసులు కావడంతో వీటిలో ప్రయాణికులు పెరుగుతున్నారు. కారిడార్ 1 మియాపూర్ నుంచి ఎల్బీనగర్ మార్గంలో ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ ఉంటోంది. సగటున రోజూ 3 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.
రద్దీ తక్కువగా ఉండే సెలవు రోజుల్లో ప్రయాణికులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా రూ.59 తో రోజంతా ప్రయాణించే అవకాశాన్ని హైదరాబాద్ మెట్రో తీసుకొచ్చింది. రాత్రి 10.15 దాటితే మెట్రో రైళ్లు అందుబాటులో లేకపోవడం ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక మెట్రో నడుస్తుంది. కొవిడ్‌కు ముందు ఐదు నిమిషాలకు ఒకటి నడిపేవారు. రద్దీకి అనుగుణంగా సర్వీసులు తగ్గిస్తున్నారు. ఇదే మాదిరిగా రాత్రి 10.15 తర్వాత పావుగంటకు ఒక సర్వీసైనా అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Also Read
Sitara Ghattamaneni: సితార కూచిపూడి నృత్యం చూసి పొంగిపోయిన మహేష్ !!
News Watch: రైతన్నకు, ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్ !
Best Fridge: 5 స్టార్ రేటింగ్‌తో చౌకైన ఫ్రిజ్‌లు.. వేసవిలో విద్యుత్ బిల్లు చాలా ఆదా అవుతుంది..