
హైదరాబాద్‌లోని పంజాగుట్ట ప్రాంతంలో పెను ప్రమాదం తప్పింది. ఎర్రమంజిల్ మెట్రో సమీపంలోని ఒక పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొట్టిస్తుండగా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయపడిపోయిన వాహనదారులు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. అప్రమత్తమైన పెట్రోల్ బంక్ సిబ్బంది మంటలార్పడంతో అందరూ ఊపరిపీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఎర్రమంజిల్ మెట్రో సమీపంలో ఉన్న బీపీసీఎల్ పెట్రోల్ బంకులో ఒక వ్యక్తి తన కారులో పెట్రోల్ కొట్టించుకునేందుకు వచ్చాడు. సిబ్బందిని పెట్రోల్ ఫిల్ చేయమని అడిగాడు.
సిబ్బంది పెట్రోల్ పొద్దామని వెళ్తుండగా ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. దీంతో భయపడిపోయిన కారులో ఉన్న ఇద్దరు బయటకు దిగిపోయారు. మంటలు చెలరేగడంతో బంకులో మొత్తం దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. గమనించిన పెట్రోల్ బంక్ సిబ్బంది అప్రమత్తమై తమ వద్ద ఉన్న అగ్నిమాపక యంత్రాలు వెంటనే మంటలను అదుపు చేశారు. దీంతో అందరూ ఊపరిపీల్చుకున్నారు.
అక్కడే ఉన్న కొందరు వాహనదారులు కార్లో మంటల చెలరేగుతున్న దృశ్యాలను తమ ఫోన్‌తో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. బంకు సిబ్బంది వెంటనే మంటలు ఆర్పకపోతే ఎంత ప్రమాదం సంభవించేది ఊహించుకుంటేనే భయంవేస్తుందని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.