ఎంతకు తెగించావ్‌రా.. ఆదివారం రాత్రి లవర్స్ మధ్య గొడవ.. ఊహించని పనిచేసి ప్రియుడు..

హైదరాబాద్‌ బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 21 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది. బిహార్‌కు చెందిన రహీనను ఆమె ప్రేమించిన యువకుడు మహమ్మద్‌ సలామ్‌ కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేయడం, మరో యువకుడితో సన్నిహితంగా ఉంటోందనే అనుమానంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

ఎంతకు తెగించావ్‌రా.. ఆదివారం రాత్రి లవర్స్ మధ్య గొడవ.. ఊహించని పనిచేసి ప్రియుడు..
Hyderabad Balapur Murder

Edited By:

Updated on: Aug 17, 2026 | 9:28 AM

హైదరాబాద్‌ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ప్రేమించిన యువతిని ఓ యువకుడు కత్తితో పొడిచి చంపాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకు యువతిని హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి నిందితుడు వెళ్లిపోయాడు.. బాధితురాలిని బిహార్‌కు చెందిన యువతిగా గుర్తించారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 21 ఏళ్ల యువతి రహీన హత్యకు గురికావడం.. ఆ తర్వాత మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి తరలించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తుండటం సంచలనంగా మారింది. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమా? హత్యలో ఒక్కరే ఉన్నారా? లేక మరికొందరి సహకారం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు సలామ్‌ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

ఫంక్షన్ హాల్‌లో పరిచయం.. ప్రేమగా..

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. బీహార్‌కు చెందిన రహీన, పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిస్మిల్లా కాలనీలో నివాసం ఉంటోంది. స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్‌లో పనిచేస్తున్న ఆమెకు, అదే ఫంక్షన్ హాల్‌లో పనిచేసే మహమ్మద్ సలామ్‌తో పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు సమాచారం. అయితే ఇటీవల వీరి మధ్య విభేదాలు మొదలైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రహీన మరో యువకుడితో సన్నిహితంగా ఉంటోందనే అనుమానంతో మహమ్మద్ సలామ్ ఆమెపై కోపం పెంచుకున్నట్లు దర్యాప్తులో తేలింది.

రాత్రి గొడవ.. ఆ తర్వాత ఏం జరిగింది?

ఈ క్రమంలో రాత్రి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం గొడవ జరిగింది. ఆ గొడవ హత్యకు దారితీసిందా? ముందుగానే హత్యకు ప్లాన్ చేశారా? లేక క్షణికావేశంలో దాడి జరిగిందా? అనే విషయాలను పోలీసులు తేల్చే పనిలో ఉన్నారు. రహీనను హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే సమయంలో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వ్యవహారం బయటపడింది.

గోనె సంచితో ఎక్కడికి తీసుకెళ్లాలనుకున్నారు?

సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఘటనాస్థలం పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్, అనుమానితుల కదలికలు, మొబైల్ ఫోన్ వివరాలను పరిశీలించే అవకాశం ఉంది.

హత్యలో మరికొందరి పాత్ర ఉందా?

హమ్మద్ సలామ్‌తో పాటు మరో ఇద్దరికి ఈ ఘటనతో సంబంధం ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే వారి పాత్ర ఏమిటన్నది పోలీసుల పూర్తిస్థాయి దర్యాప్తులో తేలాల్సి ఉంది. 21 ఏళ్ల యువతి హత్యకు గురికావడం, మృతదేహాన్ని గోనె సంచిలో తరలించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు రావడంతో బిస్మిల్లా కాలనీ పరిసరాల్లో కలకలం రేగింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us