Begum Bazar Corona Effect : కరోనా సెకండ్ వేవ్ యావత్ భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అటు తెలంగాణలో కూడా రోజు రోజుకూ పాజిటివ్ కేసులు భారీగా పెరుగిపోతున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఈ కేసులు మరింత వేగంగా విస్తరిస్తున్నాయి. అటు, నగరంలో నిత్యం రద్దీగా ఉండే బేగంబజార్‌పై కూడా కరోనా పంజా విసురుతోంది. మార్కెట్లోని దాదాపు వంద మంది వ్యాపారులకు కరోనా సోకింది. దీంతో మార్కెట్ అసోసియేషన్ ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మాత్రమే మార్కెట్ తెరవాలని నిర్ణయించింది. శుక్రవారం నుంచి సాయంత్రం 5 తర్వాత అన్ని షాపులను బంద్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని వినియోగదారులు దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. కరోనా తగ్గేవరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొంది.
ఇదిలాఉంటే, దేశంలో రోజుకు లక్షకు పైగా కరోనా కేసులు రావడంతో కేంద్రం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయిస్తే, అటు కరోనా కేసులు విజృంభించడంతో ఆయా రాష్ట్రాలు తాజాగా ఆంక్షలు ప్రకటిస్తున్నాయి. చత్తీస్‌ఘడ్ రాజధాని రాయ్‌పూర్‌లో సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించారు. ఈనెల 9వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. దుర్గ్‌లో ఇప్పటికే లాక్‌డౌన్ అమల్లో ఉంది. పంజాబ్‌లో కూడా నైట్ కర్ఫ్యూ విధించారు.
Read also : ‘చాలా రాష్ట్రాలకు డబ్బు మూటలు పంపించాడే! అవి ఏమైనట్లు?’, ‘నీతో చర్చ ఏంటి మరీ అసహ్యంగా’ : విజయసాయిరెడ్డి
ఆ గ్రామ ప్రజలు కోటీశ్వరులు.. అసలు బట్టలే ధరించరు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు!