హైదరాబాదీలు ఎగిరి గంతేసే వార్త.. నగర వ్యాప్తంగా రోడ్ల విస్తరణ.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే..

హైదరాబాద్‌లోని వాహనదారులకు ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పవచ్చు. వాహనదారులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఎట్టకేలకు నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. అవును నగరంలోని ప్రధాన రహదారుల విస్తరణకు ప్రభుత్వం సిద్ధమైంది. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మాస్టర్‌ప్లాన్‌లో కీలక మార్పులు చేస్తూ HMDA నోటిఫికేషన్ జారీ చేసింది.

హైదరాబాదీలు ఎగిరి గంతేసే వార్త.. నగర వ్యాప్తంగా రోడ్ల విస్తరణ.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే..
Hyderabad Road Expansion

Updated on: Jul 20, 2026 | 7:30 AM

హైదరాబాద్‌లోని వాహనదారులకు ట్రాఫిక్ సమస్యల నుంచి భారీ ఊరట లభించనుంది. ఎందుకంటే ఎట్టకేలకు ప్రభుత్వం నగరంలోని ప్రధాన రహదారులను విస్తరించాలని నిర్ణయించింది. రోజురోజుకూ పెరుగుతున్న రద్దీ కారణంగా ట్రాఫిక్ జామ్ పెరిగి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు గుర్తించిన ప్రభుత్వం రహదారుల వెడల్పును రెండు రేట్ల మేర పెంచాలని ఆలోచిస్తోంది. ఈ మేరకు మాస్టర్‌ ప్లాన్‌ మార్పులు చేయాలని అధికారులుకు ఇప్పటికే ప్రభుత్వం సూచించింది. ఇందులో భాగంగానే తాజాగా మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేసి అధికారిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది HMDA.

హెచ్‌ఎమ్‌డీఏ నోటిఫికేషన్ ప్రకారం.. నగరంలోని ప్రధాన రహదారుల వెడల్పును సుమారు 60 మీటర్ల వరకు పెంచుతున్నట్టు తెలిపింది. ప్రధానంగా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే హబ్సిగూడ మెట్రో స్టేషన్‌ నుంచి ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌ జంక్షన్ మీదుగా నాగోలు మూసీ బ్రిడ్జి వరకు ఈ విస్తరణ చేపట్టాలని నిర్ణయించింది. అంటే ప్రతస్తుం 30 మీట్లర్లుగా ఉన్న మొత్తం 9.21 కిలోమీటర్ల రహదారిని 60 మీటర్లకు విస్తరించనున్నట్టు తెలిపింది.

దీనితో పాటు నింబోలి అడ్డా, గోల్నాక, అంబర్‌పేట్ మీదుగా ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు నుంచి చాదర్‌ఘాట్‌ జంక్షన్ వరకు ఉన్న మొత్తం 7.78 కి.మీ రోడ్డును సైతం 60 మీటర్ల మేర పెంచాలని, ఎల్‌బీనగర్‌ బస్టాప్ నుంచి బైరామల్‌గూడ ఫ్లైఓవర్‌ వరకు ఉన్న 4.21 కి.మీను, కర్మన్‌ఘాట్‌ నుంచి చంపాపేట వరకు ఉన్న 1.57 కి.మీ రోడ్డును కూడా విస్తరించాలని నిర్ణయించింది. అలాగే ఐఎస్‌సదన్‌ క్రాస్‌ రోడ్స్ నుంచి ఆరాంఘర్‌ క్రాస్‌రోడ్‌ మీదుగా గగన్‌పహాడ్ వరకు ఉన్న సుమారు 7.38 కి.మీ రహదారులను సైతం 60 మీటర్ల వెడల్పునకు విస్తరిచనున్నట్టు స్పష్టం చేసింది.

ఇక సైబరాబాద్‌ పరిధిలోని టెక్‌ సిటీని సైతం మిరంత మెరుగుపర్చేందుకు HMDA నిర్ణయం తీసుకుంది. మాదాపూర్‌ పీఎస్‌ మీదుగా హైటెక్‌సిటీ జంక్షన్ నుంచి మాదాపూర్‌ మెట్రో వరకు ఉన్న 2.58 కిలోమీటర్ల రోడ్డును సైతం 36 మీటర్ల మేర విస్తరించాని అధికారులు నిర్ణయించారు. అలాగే బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 14లోని జీవీకే మాల్‌ జంక్షన్ నుంచి కేబీఆర్‌ పార్కు రోడ్‌ వరకు ఉన్న రోడ్డును కూడా 24 మీటర్ల మేర విస్తరించాలని నిర్ణయించింది.

ఇక సికింద్రాబాద్, అల్వాల్ వైపు ఎన్‌హెచ్‌-44 నుంచి అల్వాల్‌ సర్కిల్‌ వరకు, నేరేడ్‌మెట్‌ క్రాస్‌రోడ్‌ పరిధిలో 2.82 కిలోమీటర్ల రోడ్డును కూడా 30 మీటర్లు పెంచాలని అధికారలు నిర్ణయించారు. ఈసీఐఎల్‌ నుంచి రాధిక క్రాస్‌రోడ్‌ వరకు ఉన్న రోడ్డును 45 మీటర్లుకు పెంచాలని, హిమాయత్‌నగర్‌ సర్కిల్‌ నుంచి ఓల్డ్‌ ఎంఎల్‌ఏ క్వార్టర్స్‌ వరకు 30 మీటర్ల మేర విస్తరించాలని హెచ్‌ఎమ్‌డీఏ నిర్ణయించింది. త్వరలోనే ఈ రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నట్టు తెలిపింది.

నగర వ్యాప్తంగా ఈ మెగా రహదారుల విస్తరణ పూర్తయితే.. రవాణా వ్యవస్థ మెరుగుపడడంతో పాటు , వాహనదారులకు కూడా ట్రాఫిక్ సమస్యల నుంచి భారీ ఉపశమనం లభించనుంది. అలాగే ప్రమాదాలు కూడా తగ్గనున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us