
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఎన్నికలు జరగడం లేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కొనసాగించాల్సిందేనని పేర్కొంది.
ఈ పిటిషన్‌పై మరోసారి వాదనలు వింటామని చెప్పిన కోర్టు.. ఎలక్షన్ కమిషన్, పంచాయితీ రాజ్ ప్రిన్సిపాల్ సెక్రటరీ, ఎన్నికల సంఘానికి , తెలంగాణ బీసీ కార్పోరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్లకు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 22కు వాయిదా వేసింది. దీంతో రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిలకు మార్గం సుగమమైంది.