Hyderabad: ఆకాశానికి చిల్లు పడిందా ఏంటి.. భాగ్యనగరంలో దంచికొడుతోన్న వర్షం.. మరో 2 రోజులు

|

Sep 04, 2021 | 6:59 PM

హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా పడుతోంది వాన. చాలా ప్రాంతాల్లో దంచికొట్టింది. ఉదయం నుంచి వర్షాలు పడే మబ్బులు లేకపోయినా...

Hyderabad: ఆకాశానికి చిల్లు పడిందా ఏంటి.. భాగ్యనగరంలో దంచికొడుతోన్న వర్షం.. మరో 2 రోజులు
Hyderabad Rains
Follow us on

హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా పడుతోంది వాన. చాలా ప్రాంతాల్లో దంచికొట్టింది. ఉదయం నుంచి వర్షాలు పడే మబ్బులు లేకపోయినా… రోజంతా.. నగరంలో ఎక్కడో ఓ చోట వర్షం పడుతునే ఉంది. నగరవాసి తడిసిముద్దవుతునే ఉన్నాడు. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తుండంతో ఇబ్బందులకు గురువుతున్నారు వాహనదారులు. గత నాలుగు రోజులుగా నగరంలో వర్షాలు పడుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌ నగరం నలువైపులా భారీ వర్షం పడింది. అంబర్ పేట, హబ్సిగూడలో భారీ వర్షం పడింది. లోతట్టు కాలనీలు పూర్తిగా జలమయ్యామయ్యాయి.  ప్రజలు నానా ఆవస్థలు పడుతున్నారు. ఇటుపక్కా నగర శివారు ప్రాంతాల్లో భారీగానే పడింది వాన. ఎల్బీనగర్ మొదలుకుని హయత్ నగర్ వరకు వర్షం పడింది. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో.. జోరుగా పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాతబస్తీలోని చాలా ప్రాంతాల్లో వర్షం జోరుగానే పడింది. మూసీ వెంట భారీగా వరదనీరు పొంగి ప్రవహిస్తోంది. సికింద్రాబాద్ నుండి ఉప్పల్.. తార్నాకా నుండి ఇటు మల్కాజ్ గిరి వరకు చిరుజల్లులు పడ్డాయి.

హిమాయత్ నగర్ ఏరియాలో కూడా చిరుజల్లులు పడ్డాయి. కంటిన్యూగా వర్షాలు పడుతుండటంతో కాలనీలు పూర్తిగా జలమయ్యామయ్యాయి. హైదరాబాద్ సిటీలో రోడ్లపైకి వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు కాలనీల్లో నీరు నిలిచింది. లోతట్టు కాలనీల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. దీంతో.. GHMC అధికారులు అలర్టయ్యారు. ప్రజలెవ్వరూ రోడ్లపైకి రావొద్దని కోరుతున్నారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 48 గంటల్లో ఉత్తర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మరో 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ విభాగం తెలిపింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.

Also Read: హీరో కృష్ణుడు అరెస్ట్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు