సిటీకి మళ్లీ తప్పని వర్షం

| Edited By:

Apr 23, 2019 | 12:08 PM

హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను కమిషనర్ దానకిశోర్ వివరిస్తూ.. ముందు జాగ్రత్త చర్యగా ఎనిమిది డీఆర్‌ఎఫ్‌ బృందాలను ఏర్పాటుచేశామని.. ఒక్కో బృందంలో 25మంది సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఈ బృందం తక్షణ సహాయకచర్యలను చేపడుతుందని, ప్రజలు అవసరమైతే జీహెచ్‌ఎంసీని సంప్రదించాలని ఆయన కోరారు. కాగా గతరాత్రి ఈదురుగాలులకు పలుచోట్ల హోర్డింగ్‌లు, చెట్ల కొమ్మలు కూలిపోయాయి. కార్లు, […]

సిటీకి మళ్లీ తప్పని వర్షం
Follow us on

హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను కమిషనర్ దానకిశోర్ వివరిస్తూ.. ముందు జాగ్రత్త చర్యగా ఎనిమిది డీఆర్‌ఎఫ్‌ బృందాలను ఏర్పాటుచేశామని.. ఒక్కో బృందంలో 25మంది సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఈ బృందం తక్షణ సహాయకచర్యలను చేపడుతుందని, ప్రజలు అవసరమైతే జీహెచ్‌ఎంసీని సంప్రదించాలని ఆయన కోరారు.

కాగా గతరాత్రి ఈదురుగాలులకు పలుచోట్ల హోర్డింగ్‌లు, చెట్ల కొమ్మలు కూలిపోయాయి. కార్లు, ద్విచక్రవాహనాలు ధ్వంసం అయ్యాయి. వివిధ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అలాగే గతరాత్రి ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్‌లైట్ టవర్ కూలడంతో సుబ్రహ్మణ్యం అనే ఉద్యోగి మృతి చెందగా.. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే జీహెచ్‌ఎంసీ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సుబ్రహ్మణ్యం కుటుంబానికి ప్రభుత్వం తరఫున సహాయం అందేలా చూస్తామన్నారు.