నేడు, రేపు భాగ్యనగరంలో భారీ వర్షాలు

| Edited By:

Oct 08, 2019 | 3:16 PM

హైదరాబాద్‌లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. భాగ్య నగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. నష్టం వల్ల దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. వర్షాలు కురిస్తే చేపట్టాల్సిన పనులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణం చేయాల్సిన పనులపై లోకేశ్ కుమార్.. అధికారులతో సోమవారం (అక్టోబర్ 7) సమీక్ష […]

నేడు, రేపు భాగ్యనగరంలో భారీ వర్షాలు
Follow us on

హైదరాబాద్‌లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. భాగ్య నగరంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. నష్టం వల్ల దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. వర్షాలు కురిస్తే చేపట్టాల్సిన పనులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణం చేయాల్సిన పనులపై లోకేశ్ కుమార్.. అధికారులతో సోమవారం (అక్టోబర్ 7) సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

నగరంలో విష జ్వరాలు వ్యాపిస్తున్న నేపథ్యంలో దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు లోకేశ్ కుమార్ తెలిపారు. నీరు నిలిచి ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేస్తున్నట్లు వెల్లడించారు. నగరంలో డెంగ్యూ కేసులు తగ్గిపోయాయని చెప్పారు.

వర్షాల వల్ల గ్రేటర్‌లో చాలా చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. వర్షానికి దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేస్తున్నామని చెప్పారు. గుంతలను పూడ్చివేస్తున్నట్లు వెల్లడించారు. గంటకు 2 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే రోడ్లపై నీరు నిలుస్తోందని తెలిపారు.