Hyderbad: బీరే కదా అని తేలిగ్గా తీసుకుంటే బేర్ మంటారు.. ఆ సమస్యలు తప్పవని నిపుణుల హెచ్చరిక

|

May 02, 2022 | 4:18 PM

బయట ఎండలు మండిపోతున్నాయి. వేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు అధికంగా బీరు తాగుతున్నారు. గతేడాది తొలి నాలుగు నెలల్లో 1,06,42,143 కార్టన్ల బీరు అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది....

Hyderbad: బీరే కదా అని తేలిగ్గా తీసుకుంటే బేర్ మంటారు.. ఆ సమస్యలు తప్పవని నిపుణుల హెచ్చరిక
Students Wine Party
Follow us on

బయట ఎండలు మండిపోతున్నాయి. వేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు అధికంగా బీరు తాగుతున్నారు. గతేడాది తొలి నాలుగు నెలల్లో 1,06,42,143 కార్టన్ల బీరు అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది జనవరి- ఏప్రిల్‌ వరకూ రాష్ట్రంలో 1,49,17,004 కార్టన్ల సీసాలు అమ్ముడయ్యాయి. ఈ లెక్కలు చూస్తుంటేనే రాష్ట్రంలో బీర్ల విక్రయాలు ఎంతగా పెరిగాయో అర్థమవుతోంది. తాము తాగుతున్నది బీరే కదా అని చాలామంది సమర్థించుకుంటారు. కానీ బీరులోనూ ఆల్కహాల్‌ ఉంటుంది. 650 మి.లీ.లో 5-7.5 శాతం, బ్రాందీ , విస్కీలలో 42.8 శాతం, వైన్‌లో 6-24 శాతం వరకూ ఆల్కహాల్‌ ఉంటుంది. రోజుకు 90 ఎంఎల్‌ కంటే ఎక్కువ ఆల్కహాల్‌ తీసుకుంటే అది కాలేయంపై ప్రభావం చూపుతుంది. కాలేయం పరిమాణం కుంచించుకుపోతుంది. దీన్నే ‘లివర్‌ సిర్రోసిస్‌’ అంటారు. ఇప్పటికే కాలేయ సమస్యలున్నవారు, అధిక కొవ్వు, బరువు, డయాబెటిస్ తో బాధపడుతున్నవారు.. అదేపనిగా ఆల్కహాల్‌ తీసుకుంటే ఇంకా త్వరగా కాలేయ జబ్బుల బారిన పడే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కడుపులో ఉండే జిగురు పొరను ఆల్కహాల్‌ దెబ్బతీస్తుంది. ఫలితంగా అల్సర్లు ఏర్పడి, రక్త వాంతులు.. విరేచనాల సమస్యలు ఎదురవుతాయి. వేసవిలో కూల్ డ్రింక్స్ తాగేవారిలోనూ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. బీరుకు బానిసలవ్వడం వల్ల స్థూలకాయులుగా మారతారు. నాడీ వ్యవస్థపై ఆల్కహాల్‌ ప్రభావం పడుతుంది. మెదడుపై దుష్ప్రభావం చూపడంతో ఆలోచనాశక్తి తగ్గిపోతుంది. కొన్నిసార్లు మెదడులో రక్తస్రావం జరిగే ప్రమాదమూ ఉంటుంది. ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకున్న వారికి, వారు వాడుతున్న మందుల ప్రభావం తగ్గిపోతుంది. అధిక రక్తపోటు ఉన్నవారిలో బీపీ స్థాయి పెరిగుతుంది. బీరు ఎక్కువగా తీసుకున్నప్పుడు శరీరంలోని నీరు, సోడియం, పొటాషియం వంటి మూలకాలు.. మూత్రం ద్వారా బయటకు పోతాయి. డయాబెటిస్ రోగుల్లోని రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా తగ్గి.. ‘హైపోగ్లేసిమియా’ అనే ప్రమాదకరస్థితిలో కోమాలోకి వెళ్లే ప్రమాదం ఏర్పడుతుంది.

బీర్ అధికంగా తాగడం వల్ల మానసిక అసమతుల్యం ఏర్పడుతుంది. శ్వాసవ్యవస్థపై ప్రభావం పడి.. ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఆలోచించి, నిర్ణయాలు తీసుకునేవిచక్షణ కోల్పోతారు. తాగి వాహనం నడిపితే, ప్రమాదాలు జరగే అవకాశాలున్నాయి. మానసిక ఆందోళన, కుంగుబాటు సమస్యలు మరింత ఎక్కువవుతాయి. అయితే.. వేసవిలో పండ్ల రసాలు, నిమ్మ రసాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మద్యానికి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం  ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

అరవిరిసిన అందం.. దివ్య భారతి సొంతం..

ఎవరైనా నీ అందం ముందు దిగదుడుపే.. ‘కీర్తి సురేష్’..