GHMC Initiative Programe to check for Mosquitoes: సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చకోవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందు వరుసలో నిలుస్తోంది. ఇదే క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. నగర ప్రజలకు దోమల బెడద నుండి విముక్తితో పాటు దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల నివారణకు జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్యాన్ని అంధించి, తద్వారా జీవన ప్రమాణాల మెరుగుకు దోహదపడే విధంగా అధికారులు ప్రత్యేక చొరవ కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగర పరిధిలోగల చెరువులు, కుంటలు, నీటి నిలువ ప్రదేశాలలో దోమలను నియంత్రించడానికి సమగ్ర విధానాన్ని అనుసరిస్తూ దోమల లార్వాలను నియంత్రించుటకు డ్రోన్లను వినియోగిస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
ఇందులో భాగంగా చెరువులో ఉండే గుర్రపు డెక్కను తొలగించడంతో పాటు దోమల పెరుగుదలను నియంత్రించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు డ్రోన్లను వినియోగిస్తున్నారు. నీటితో నిండిన ప్రదేశాలు, వృక్షసంపద, సేంద్రియ వ్యర్ధాలు ఉన్న చెరువులలో మన్సోనియా, అర్మిజెరిస్, క్యూలెక్స్ వంటి ఇబ్బంది కలిగించే దోమలను లార్వా దశలోనే నియంత్రించడానికి డ్రోన్ల సహాయంతో దాడి చేయడం ముఖ్య ఉద్దేశ్యమని జీహెచ్ఎంసి ఎంటమాలాజి శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ఫీల్డ్ వర్కర్ల సహాయంతో చెరువుల పై భౌతికంగా రసాయనాలను నేషనల్ వెక్టర్ బోర్న్ డీజీసెస్ కంట్రోల్ ఢిల్లీ వారిచే నిర్ణయంచబడిన మోతాదులో పిచికారి చేయడం జరుగుతోందని అధికారులు తెలిపారు. చెరువుల నుండి దోమల బెడద సమర్థవంతంగా ఎదుర్కునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని లక్ష్యాన్ని చేరేందుకు జీహెచ్ఎంసీ కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో మురుగు నీరు ఎక్కువ నిలిచే చెరువులను మొదటి విడతగా ఎంపిక చేసి దోమల నివారణకు డ్రోన్లను వినియోగించుకోవడం జరుగుతోంది.
నగరంలో మొదటగా 30 చెరువులలో డ్రోన్ల ద్వారా దోమల నివారణకు వాడే రసాయనాన్ని పిచికారి చేయడం జరగుతుందని జీహెచ్ఎంసీ ఎంటమాలాజీ అధికారులు తెలిపారు. ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఒప్పందం చేసుకొని నెలకు రెండుసార్లు, అవసరమైనచోట మూడు సార్లు కూడా పిచికారి చేయడం జరుగుతుందన్నారు.
డ్రోన్ల వల్ల ప్రయోజనాలు