Hyderabad: పరుపుల మాటున పత్తి యాపారం.. తెలిస్తే బిత్తరపోవడం ఖాయం

పుష్ప సినిమాలో పాల ట్యాంకర్‌లో ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్‌ చేసిన ఐడియాను.. ఇప్పుడు గంజాయి స్మగ్లర్లు అనుసరిస్తున్నారు. కేటుగాళ్ల ఐడియాలు చూసి పోలీసులు కంగుతింటున్నారు.

Hyderabad: పరుపుల మాటున పత్తి యాపారం.. తెలిస్తే బిత్తరపోవడం ఖాయం
Smuggling

Updated on: Apr 12, 2022 | 5:18 PM

ఇప్పటి వరకు మనం పుష్పను థీయేటర్లలో రీల్‌గానే చూశాం. అది సాధ్యమేనా అనుకున్నాము. అయితే.. మనమెందుకు పుష్ప(Pushpa) సీన్‌ను రీయల్‌ చేయలేము అనుకున్నారో ఏమో.. ఆ మొనగాళ్లు. అంతే.. ఇంచుమించు అలాంటి స్కెచ్చే  వేశారు. పుష్ప సినిమాను ఏ మాత్రం తీసిపోని విధంగా.. సేమ్‌ టు సేమ్‌ లెవల్‌లో… పెద్ద ఎత్తున గంజాయి(Cannabis)ని సరఫరా చేస్తూ పట్టుబడ్డారు. విశాఖ జిల్లా(Visakhapatnam district) బలిమెల నుంచి హైదరాాబాద్‌కు ఈ గంజాయి తరలిస్తున్నారు. పరువుల్లో గంజాయి ప్యాకెట్లు నింపి సరఫరా చేస్తున్నారు స్మగ్లర్లు. పరుపులను ఆటోలో పెట్టుకొని హైదరాబాద్ తీసుకొస్తున్నారు ముగ్గురు నిందితులు. ఈ సమాచారం పోలీసులకు రహస్యంగా తెలిసింది. అంతే.. రోడ్డుపై అడ్డా వేసిన పోలీసులు.. అనుమానం వచ్చిన ఓ ఆటోను అదుపులోకి తీసుకున్నారు. అంతే.. దానిలో చెక్‌ చేయగా.. అసలు బండారం బయట పడింది. పరుపులను విప్పి చూసిన మాదాపూర్‌ SOT పోలీసులు షాక్‌ తిన్నారు. పరుపుల నిండా గంజాయి ప్యాకెట్లే దర్శనమిచ్చాయి. ఎవరికి కూడా అనుమానం రాకుండా కొత్త పరుపుల్లో ప్యాకింగ్‌ చేసి తరలిస్తున్నారు. ఈ కొత్త ట్రిక్‌ను చూసిన పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. 81 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

 

Also Read: Telangana: ఆలయ ప్రహరీ పునాది తవ్వుతుండగా బయటపడ్డ పెట్టె.. ఓపెన్ చేసి చూడగా కళ్లు జిగేల్…

Andhra Pradesh: ఏపీలోని ఆరోగ్య మిత్రలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ .. ఇకపై వారికి కూడా..