హైదరాబాద్‌లో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యం: డా. నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్

ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ వైపు చూస్తున్నారని.. హైదరాబాద్‌లోని రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ రాయబారి కార్యాలయంలోని గౌరవ సలహాదారు (తెలంగాణ - ఆంధ్రప్రదేశ్) డా. నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్ పేర్కొన్నారు. అట్లాంటాలో తెలంగాణ కనెక్ట్స్ USA సమ్మిట్ లో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

హైదరాబాద్‌లో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యం: డా. నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్
Dr. Nawab Mir Nasir Ali Khan

Updated on: Jan 27, 2026 | 6:21 PM

ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ వైపు చూస్తున్నారని.. హైదరాబాద్‌లోని రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ రాయబారి కార్యాలయంలోని గౌరవ సలహాదారు (తెలంగాణ – ఆంధ్రప్రదేశ్) డా. నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్ పేర్కొన్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి పెట్టుబడి సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అట్లాంటాలో తెలంగాణ కనెక్ట్స్ USA సమ్మిట్ ను  నిర్వహించారు. ఈ కార్యక్రమం INC సంస్థ, అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి నిర్వహించారు. అమెరికా, కజకిస్తాన్‌తో పాటు ఇతర దేశాల పెట్టుబడిదారులను హైదరాబాద్‌కు తీసుకురావడమే ఈ సహకార కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.  ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లోని రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ రాయబారి కార్యాలయంలోని గౌరవ సలహాదారు (తెలంగాణ – ఆంధ్రప్రదేశ్) డా. నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్ ప్రత్యేక అతిథిగా పాల్గొని..  అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ ప్రాధాన్యతను వివరించారు.

ఈ సందర్భంగా డా. నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్  మాట్లాడుతూ.. “ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ వైపు చూస్తున్నారు. టెక్నాలజీ, స్టార్టప్‌లు, పరిశ్రమలు, మౌలిక వసతుల రంగాల్లో ఈ నగరం అపార అవకాశాలతో ఎదుగుతోంది” అని తెలిపారు. ఈ సందర్భంగా TECCI సేవలను అభినందించారు.

వీడియో చూడండి..

డా. నవాబ్ మీర్ నాసిర్ అలీ ఖాన్ మాట్లాడుతూ, కజకిస్తాన్–భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు భవిష్యత్తులో మరింత బలపడతాయని, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా ఎదగడానికి ఇది దోహదపడుతుందని అన్నారు. తెలంగాణ, యునైటెడ్ స్టేట్స్ మధ్య ఆర్థిక, సాంకేతిక, ఆవిష్కరణ-నేతృత్వంలోని భాగస్వామ్యాలను బలోపేతం చేయడంలో వ్యూహాత్మక ప్రాముఖ్యతను వివరించడంతోపాటు.. TECCI ప్రతినిధి కార్తిక్ ను అభినందించారు.

ఈ కార్యక్రమం ద్వారా హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పెరిగి, కొత్త పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు సృష్టించే దిశగా అడుగు పడినట్లు వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..