AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఛీ.. ఛీ.. ఎంత పని చేశావ్ ఇషికా.. ప్రియుడితో కలిసి కన్నతల్లిని నట్టింట్లోనే..

జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్ నగర్‌లో అంజు (40) కూతురు ఇషికాతో కలిసి నివాసముంటోంది.. అయితే.. 2025 మే నుంచి తల్లి అంజు కనిపించడం లేదని.. కూతురు ఇషికా ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని.. దాదాపు సంవత్సరం అయినా.. క్లూ దొరకలేదని పోలీసులు తెలిపారు.

Hyderabad: ఛీ.. ఛీ.. ఎంత పని చేశావ్ ఇషికా.. ప్రియుడితో కలిసి కన్నతల్లిని నట్టింట్లోనే..
Hyderabad - Daughter kills mother
Shaik Madar Saheb
|

Updated on: Mar 25, 2026 | 3:10 PM

Share

హైదరాబాద్ జవహర్‌నగర్‌లో ఘోరం వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి తల్లిని చంపి ఇంట్లోనే పాతిపెట్టిందో కూతురు.. ఏడాది క్రితం జరిగిన ఈ మర్డర్ కేసును బైక్ పట్టించింది.. తన ప్రేమకు అడ్డువస్తున్నారనే కారణంతో ఏడాది క్రితం తల్లి అంజును కూతురు ఇషికా.. ప్రియుడితో కలిసి చంపేసింది. ఆ తర్వాత తల్లి శవాన్ని ఏకంగా.. ఇంట్లోనే పాతిపెట్టింది. టూ వీలర్‌ను దాచి పెట్టి.. బండితో సహా తల్లి కనిపించట్లేదంటూ ఫిర్యాదు చేసింది. ఏమీ తెలియనట్టు అమాయకురాలిగా నటించింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన జవహర్‌నగర్ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.. అయితే.. ఏడాదిగా ఇంతవరకు కేసును తేల్చలేదు. లేటెస్ట్‌గా.. మృతురాలి వాహనాన్ని అమ్మే క్రమంలో విషయం బయటపడింది.

టూ వీలర్‌ను అమ్మేందుకు రాంకోఠిలోని ఓ షాపుకు వెళ్లాడు ఇషికా ప్రియుడు.. ఆ సందర్భంగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన షాప్ ఓనర్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో మర్డర్ వ్యవహారం బయటపడింది. హత్యకు యువతి ప్రియుడు కూడా సహకరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలంలో పోలీసులు, క్లూస్ టీం సహాయంతో తవ్వకాలు చేపట్టారు.

ఇషికా, ప్రియుడు మౌంటీ రాజ్‌పుత్‌ అరెస్ట్

జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్ నగర్‌లో అంజు (40) కూతురు ఇషికాతో కలిసి నివాసముంటోంది.. అయితే.. 2025 మే నుంచి తల్లి అంజు కనిపించడం లేదని.. కూతురు ఇషికా ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని.. దాదాపు సంవత్సరం అయినా.. క్లూ దొరకలేదని పోలీసులు తెలిపారు. అయితే.. ఈ కేసులో కూతురే ప్రధాన నిందితురాలని పేర్కొన్నారు. ఇషికా.. మౌంటి రాజ్ పుత్ ప్రేమించుకున్నారని.. అయితే.. వారి ప్రేమకు అడ్డు చెప్పిందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నామన్నారు. ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చి గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లోనే పాతి పెట్టినట్లు పేర్కొన్నారు. చివరకు బైక్ ఈ కేసులో కీలకంగా మారిందని.. అంజు కూతురు ఇషికా, మౌంటి రాజ్‌పుత్ ఇద్దరినీ.. అదుపులోకి తీసుకోని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే.. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. నిందితులకు కఠిన శిక్ష విధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం