Hyderabad: వేసవిలో వాహనాలు బయటకు తీస్తున్నారా.? అయితే ఓసారి చెక్‌ చేసుకోండని చెబుతోన్న ట్రాఫిక్‌ పోలీసులు.

|

Apr 13, 2023 | 5:47 PM

ఎండలు దంచికొడుతున్నాయి. ఇంకా పూర్తిగా ఎండ కాలం రాకముందే భానుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు. మధ్యాహ్నం ఇంటి నుంచి బయట అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.

Hyderabad: వేసవిలో వాహనాలు బయటకు తీస్తున్నారా.? అయితే ఓసారి చెక్‌ చేసుకోండని చెబుతోన్న ట్రాఫిక్‌ పోలీసులు.
Traffic Police
Follow us on

ఎండలు దంచికొడుతున్నాయి. ఇంకా పూర్తిగా ఎండ కాలం రాకముందే భానుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు. మధ్యాహ్నం ఇంటి నుంచి బయట అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. మనుషులు మన పరిస్థితి ఇలా ఉంటే కుక్కలు వంటి మూగ జీవాల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది.

మండుటెండల్లో రోడ్లపై ఉండే కుక్కలు కాస్త నీడ కోసం చెట్ల కిందికి చేరుతుంటాయి. అయితే ఈ రోజుల్లో ఆ చెట్లు కూడా లేని పరిస్థితి వచ్చింది. దీంతో ఆగి ఉన్న వాహనాల కింద నీడలో విశ్రాంతి తీసుకుంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకొనే సైబరాబాద్ పోలీసులు వాహనదారులకు కీలక ప్రకటన చేశారు. సాధారణంగా కారు, జీపులాంటి వాహనాలను బయటకు తీసెప్పుడు వెనకా ముందు చూడకుండా స్టార్ట్‌ చేస్తుంటాం. అయితే ఇకపై అలా చేయకండి చెబుతున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

ఎండాకాలం జంతువులు వాహనాల కింద విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనం నడిపే ముందు బండి కింద ఒకసారి పరిశీలించండి అంటూ ఓ సందేశాన్ని ఇచ్చారు. పొరపాటు వాహనం కింద చూడకుండా స్టార్ట్‌ చేస్తే మూగ జీవాలు మరణించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మీరు కూడా ప్రయాణం ప్రారంభించే ముందు ఓసారి వాహనం కింద చెక్‌ చేయండి, మూగ జీవాలను రక్షించండి.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..