Fraud Alert: కేటుగాళ్లు రూటు మార్చారు.. సెల్ ఫోన్ చోరీ చేసి క్రెడిట్ కార్డు వివరాలు లాగేశారు.. కట్ చేస్తే..

| Edited By: Shaik Madar Saheb

Jun 03, 2024 | 12:43 PM

తన సెల్ ఫోన్ పోయిందంటూ మొదట పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ బాధితుడు.. ఆ భాడుతుడి సెల్ ఫోన్ వెతుకుతున్న క్రమంలోనే పోలీసులకు మరో ఫిర్యాదు వచ్చింది. కొట్టేసిన తన సెల్ ఫోన్ లో నుచి అన్ని రకాల లావాదేవీలకు యాక్సిస్ పొందిన నిందితుడు తన క్రెడిట్ కార్డ్ వివరాలను తెలుసుకుని డబ్బులను సైతం కాజేశాడు.

Fraud Alert: కేటుగాళ్లు రూటు మార్చారు.. సెల్ ఫోన్ చోరీ చేసి క్రెడిట్ కార్డు వివరాలు లాగేశారు.. కట్ చేస్తే..
Cyber Crime
Follow us on

తన సెల్ ఫోన్ పోయిందంటూ మొదట పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ బాధితుడు.. ఆ భాడుతుడి సెల్ ఫోన్ వెతుకుతున్న క్రమంలోనే పోలీసులకు మరో ఫిర్యాదు వచ్చింది. కొట్టేసిన తన సెల్ ఫోన్ లో నుచి అన్ని రకాల లావాదేవీలకు యాక్సిస్ పొందిన నిందితుడు తన క్రెడిట్ కార్డ్ వివరాలను తెలుసుకుని డబ్బులను సైతం కాజేశాడు. తనకు తెలియకుండానే తన క్రెడిట్ లిమిట్‌ను రెండు లక్షల నుంచి రూ.5 లక్షల పెంచుతూ రిక్వెస్ట్ పెట్టాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు హైదరాబాద్ నల్లకుంటకు చెందిన బాధితుడు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవల కాలంలో సెల్ఫోన్ పోయిన కొద్ది రోజుల్లోనే CEIR ద్వారా ఫిర్యాదు నమోదు చేసుకుని.. రికవరీ చేసి తిరిగి బాధితులకు తిరిగి ఇచ్చేస్తున్నారు పోలీసులు. ఇది పసిగట్టిన కేటుగాళ్లు.. ఈ క్రమంలోనే కొట్టేసిన సెల్ ఫోన్ నుండే సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.. నల్లకుంటకు చెందిన వ్యక్తి.. మెట్రోలో ప్రయాణిస్తున్న తరుణంలో తన సెల్ ఫోన్ పోగొట్టుకున్న విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు . అప్పటికే తన ఫోన్లో ఉన్న సిమ్ ను బ్లాక్ చేసి కొత్త సిమ్ కార్డు తీసుకున్నాడు. అయితే, అప్పటికే.. బాధితుడి ఫోన్ ను నిందితుడు పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. అందులో ఉన్న ఈ మెయిల్స్ కి వచ్చే ఓటీపీలు అన్నిటిని యాక్సిస్ చేస్తూ క్రెడిట్ కార్డు లిమిట్ ను పెంచాల్సిందిగా రిక్వెస్ట్ పెట్టాడు. అలా బాధితుడి ఖాతాలో ఉన్న నాలుగు లక్షల రూపాయలతో ఆన్లైన్ షాపింగ్ సైతం చేశాడు.

రెండు రోజుల తర్వాత తన ఈమెయిల్ కు బ్యాంకుల నుంచి కొన్ని మెస్సెజ్ లు రావడంతో బాధితుడు అలర్టయ్యాడు. ఒకసారిగా బ్యాంకుల నుంచి జరిగిన లావాదేవీలు చూసి షాక్ అయ్యాడు.. తనకు తెలియకుండానే రిక్వెస్ట్లు పోవటంతో అవాక్కైన బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.

అన్ని వివరాలు సేకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఈ సెల్ ఫోన్ యాక్సెస్ బెంగుళూరులో ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ముంబై లోనూ కొన్ని లావాదేవీలు జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..