సీపీఐ జాతీయ సమావేశాలు ప్రారంభం.. మగ్ధూంభవన్‌లో మూడు రోజుల పాటు సాగనున్న సమావేశాలు

|

Jan 29, 2021 | 1:33 PM

సీపీఐ జాతీయ సమావేశాలు ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌లో ప్రారంభం అయ్యాయి. మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో..

సీపీఐ జాతీయ సమావేశాలు ప్రారంభం.. మగ్ధూంభవన్‌లో మూడు రోజుల పాటు సాగనున్న సమావేశాలు
Follow us on

సీపీఐ జాతీయ సమావేశాలు ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌లో ప్రారంభం అయ్యాయి. మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో మొదటి రోజు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం, రెండు, మూడు రోజుల్లో పార్టీ జాతీయ సమితి సమావేశాలు జరుగుతాయి.

ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ అగ్రనేతలు హాజయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా గురువారమే హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సమావేశాల ఏర్పాట్లను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ సమీక్షిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాల నుంచి అగ్ర నేతలతో పాటు జాతీయ కార్యదర్శి అతుల్‌కుమార్‌ అంజన్‌, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఉద్యోగులకు మద్దతుగా బీజేపీ.. 45 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ అమలు చేయాలని బీజేపీ శ్రేణుల నిరసనలు