AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suravaram Sudhakar Reddy: సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్‌రెడ్డి కన్నుమూత

సీపీఐ అగ్ర నాయకులు, మాజీ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని ఓ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. సురవరం సుధాకర్ రెడ్డి మరణాన్ని సీపీఐ పార్టీ అధికారికంగా ధ్రువీకరించింది.

Suravaram Sudhakar Reddy: సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్‌రెడ్డి కన్నుమూత
Suravaram Sudhakar Reddy
Basha Shek
|

Updated on: Aug 22, 2025 | 11:54 PM

Share

సీపీఐ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌ రెడ్డి (83) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే   శుక్రవారం (ఆగస్టు 22) రాత్రి పరిస్థితి విషమించడంతో సురవరం తుదిశ్వాస విడిచారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25న సుధాకర్ రెడ్డి జన్మించారు. 1998, 2004లో జరిగిన ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2012 నుంచి 2019వరకు ఆయన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవిలో కొనసాగారు. సురవరం సుధాకర్‌రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి స్వాతంత్య్ర సమరయోధుడు.  తెలంగాణ సాయుధ పోరాటంలోనూ ఆయన పాల్గొన్నారు. సుధాకర్‌రెడ్డి  కర్నూలులోని ఉస్మానియా కళాశాల నుంచి బీఏ చేశారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ పట్టాపొందారు. ఇక సుధాకర్ రెడ్డి 1974లో విజయలక్ష్మిని వివాహం చేసున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సుధాకర్ రెడ్డి మరణంతో కమ్యూనిస్టులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన మరణానికి తీవ్ర సంతాపం తెలుపుతున్నారు.

Follow Us
ఈ లడ్డూ రోజుకి ఒకటి తిన్నారంటే.. ఈ సమస్యలకు చూమంత్రం వేసినట్టే
ఈ లడ్డూ రోజుకి ఒకటి తిన్నారంటే.. ఈ సమస్యలకు చూమంత్రం వేసినట్టే
మీ పిల్లల కోసం ల్యాప్‌టాప్‌ కొంటున్నారా?
మీ పిల్లల కోసం ల్యాప్‌టాప్‌ కొంటున్నారా?
పాలు విరిగిపోకుండా చేసే సైంటిఫిక్ పద్ధతులు తెలుసా
పాలు విరిగిపోకుండా చేసే సైంటిఫిక్ పద్ధతులు తెలుసా
తెలంగాణ విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు
తెలంగాణ విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు
20 రోజులకే ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్.. అధికారిక ప్రకటన
20 రోజులకే ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్.. అధికారిక ప్రకటన
నాసా నుండి భారత్ వరకు ఎవరికీ అంతుచిక్కని రహస్యాలు!
నాసా నుండి భారత్ వరకు ఎవరికీ అంతుచిక్కని రహస్యాలు!
నోరూరించే ఉసిరికాయ కూర.. ఓసారి ఇలా ట్రై చేయండి.. టేస్ట్ అదుర్స్
నోరూరించే ఉసిరికాయ కూర.. ఓసారి ఇలా ట్రై చేయండి.. టేస్ట్ అదుర్స్
బంగారం, వెండికి బ్రేకులు.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ ఎంతంటే..
బంగారం, వెండికి బ్రేకులు.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ ఎంతంటే..
సముద్ర తీరంలో సాహసాలు.. మనసును రంజింపజేసే సూర్యాస్తమయాలు!
సముద్ర తీరంలో సాహసాలు.. మనసును రంజింపజేసే సూర్యాస్తమయాలు!
గోల్డ్‌ను క్యారెట్లలో, వెండిని కిలోల్లో ఎందుకు కొలుస్తారో తెలుసా?
గోల్డ్‌ను క్యారెట్లలో, వెండిని కిలోల్లో ఎందుకు కొలుస్తారో తెలుసా?