Hyderabad: హైదరాబాద్‌లో భారీగా పోలీసుల బదిలీలు.. 2018 తర్వాత ఇదే తొలిసారి..

Hyderabad: కరోనా (Corona) పరిస్థితుల నేపథ్యంలో గతకొన్నేళ్లుగా నిలిచిపోయిన పోలీసుల బదిలీలపై ఎట్టకేలకు ముందడుగు పడింది. 2018 నుంచి కోవిడ్‌ కారణంగా పెండింగ్‌లో ఉన్న బదిలీలపై హైదరాబాద్‌...

Hyderabad: హైదరాబాద్‌లో భారీగా పోలీసుల బదిలీలు.. 2018 తర్వాత ఇదే తొలిసారి..
Hyderabad Police
Follow us

|

Updated on: Jun 16, 2022 | 3:18 PM

Hyderabad: కరోనా (Corona) పరిస్థితుల నేపథ్యంలో గతకొన్నేళ్లుగా నిలిచిపోయిన పోలీసుల బదిలీలపై ఎట్టకేలకు ముందడుగు పడింది. 2018 నుంచి కోవిడ్‌ కారణంగా పెండింగ్‌లో ఉన్న బదిలీలపై హైదరాబాద్‌ సిపి సీవీ ఆనంద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నగరంలో మొత్తం 2865 సిబ్బంది బదిలీలు జరిగాయి. 5 నుంచి 7 ఏళ్లుగా ఒకే జోన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీలకు అధికారులు కొన్ని రోజుల క్రితం కసరత్తు మొదలు పెట్టారు.

ఈ బదిలీలలో తెలంగాణ రాష్ట్ర పోలీసులు అభివృద్ధి చేసిన హ్యూమన్‌ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ (HRMS) కీలక పాత్ర పోషించింది. చాలా కాలంపాటుగా ఒకే చోట పనిచేస్తూ, బదిలీకి అర్హులైన సిబ్బంది జాబితాను రూపొందించారు. అర్హులైన పోలీసు అధికారులకు పోస్టింగ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను 2022 మే 06న విడుదల చేశారు. బదిలీలు కావాలనుకునే HRMS ద్వారా ఏవైనా 4 స్థానాలను ఎంపిక చేసుకోవాలని అధికారులు గతంలో సూచించారు. ఈ ఆప్షన్ సిస్టమ్ మే 12వ తేదీ నుంచి 21 మే 2022 వరకు ఉద్యోగులకు అందుబాటులో ఉంచారు. మొత్తం 2865 సిబ్బంది 4 స్థానాలకు గాను ఆన్‌లైన్ (HRMS) ద్వారా వారికి కావాల్సిన పోస్టింగ్‌లను ఎంపిక చేసుకున్నారు.

దీని ఆధారంగా సిబ్బంది తమకు నచ్చిన ప్రాంతాలను ఎంచుకున్నారు. ఉద్యోగుల ఆప్షన్స్‌ను పరిగణలోకి తీసుకున్న తర్వాత గురువారం (16-06-2022) మొత్తం 2006 కానిస్టేబుల్స్‌, 640 హెడ్‌ కానిస్టేబుల్స్‌, 219 మంది ఎస్‌ఐలకు సంబంధించి బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త పోస్టింగ్‌కు సంబంధించిన వివరాలను HRMS పోర్టల్‌లో అందుబాటులో ఉంచారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్