Hyderabad: 38 మంది ఇంజనీర్లకు ఒక్క రోజు వేతనం కట్.. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ షాకింగ్ నిర్ణయం..

అధికారుల తీరుపై గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్‌ కార్పొరేషన్‌(GHMC) ఇంజినీరింగ్ అధికారుల తీరు పై కమిషనర్ లోకేశ్‌ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్‌ పరిధిలో నాలాల దగ్గర ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో..

Hyderabad: 38 మంది ఇంజనీర్లకు ఒక్క రోజు వేతనం కట్.. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ షాకింగ్ నిర్ణయం..
Ghmc Commissioner Lokesh Kumar

Updated on: Jun 28, 2022 | 3:53 PM

ఓ వైపు హైదరాబాద్‌లో జోరు వానలు.. నిండుతున్న నాలాలు.. అధికారుల తీరుపై గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్‌ కార్పొరేషన్‌(GHMC) ఇంజినీరింగ్ అధికారుల తీరు పై కమిషనర్ లోకేశ్‌ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్‌ పరిధిలో నాలాల దగ్గర ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమైన వారిపై చర్యలు తీసుకున్నారు. నగరంలో ప్రమాదకరమైన నాలాలను గుర్తించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పదేపదే ఆదేశించినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నట్లుగా వ్యవహరిస్తున్న ఇంజినీర్లపై కమిషనర్ చర్యలు తీసుకున్నారు. పలు నాలాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన లోకేశ్‌కుమార్‌.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమైన 38 మంది జీహెచ్ఎంసీ ఇంజినీర్ల ఒకరోజు వేతనాన్ని కట్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

నగర ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని అన్నారు. నాలాలపై జాగ్రత్తలు తీసుకోని అధికారులందరిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని కమిషనర్ వెల్లడించారు.  భవిష్యత్తులో ఇదే తరహాలో వ్యవహరిస్తే ఎలాంటి నోటీసు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని లోకేశ్‌కుమార్ హెచ్చరించారు.

హైదరాబాద్ వార్తల కోసం

Loading...
Unable to load recommendations.
Follow Us