పవన్‌కు కేసీఆర్ షాక్.. మళ్లీ ప్రయత్నిస్తానన్న జనసేనాని

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కేసీఆర్ షాక్ ఇచ్చారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తోన్న ఆర్టీసీ సమ్మె విషయమై కేసీఆర్‌తో మాట్లాడేందుకు పవన్ ప్రయత్నాలు చేయగా.. ఆయన నుంచి అపాయింట్‌మెంట్ దొరకలేదు. ఈ విషయాన్ని పవన్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘‘తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయమై మాట్లాడేందుకు సీఎం కేసీఆర్, కే.కేశవరావు, కొందరు మంత్రులను నేను కలవడానికి సమయం కోసం జనసేన పార్టీ ప్రతినిధులు ప్రయత్నం చేశారు. అయితే దీనిపై మాట్లాడేందుకు వారు ఎవరూ సంసిద్ధంగా లేరు. […]

పవన్‌కు కేసీఆర్ షాక్.. మళ్లీ ప్రయత్నిస్తానన్న జనసేనాని
TV9 Telugu Digital Desk

| Edited By:

Nov 02, 2019 | 8:22 AM

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కేసీఆర్ షాక్ ఇచ్చారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తోన్న ఆర్టీసీ సమ్మె విషయమై కేసీఆర్‌తో మాట్లాడేందుకు పవన్ ప్రయత్నాలు చేయగా.. ఆయన నుంచి అపాయింట్‌మెంట్ దొరకలేదు. ఈ విషయాన్ని పవన్ సోషల్ మీడియాలో వెల్లడించారు.

‘‘తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయమై మాట్లాడేందుకు సీఎం కేసీఆర్, కే.కేశవరావు, కొందరు మంత్రులను నేను కలవడానికి సమయం కోసం జనసేన పార్టీ ప్రతినిధులు ప్రయత్నం చేశారు. అయితే దీనిపై మాట్లాడేందుకు వారు ఎవరూ సంసిద్ధంగా లేరు. అందువల్ల వారిని కలవలేకపోయాను. 3వ తేదీన విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహణలో భాగంగా నేను ఆ కార్యక్రమానికి వెళ్లాల్సి ఉండటంతో.. వచ్చిన తరువాత మరోమారు కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నం చేస్తాను. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు వారికి అండగా ఉంటాను’’ అని పవన్ కల్యాణ్ వెల్లడించారు.

కాగా తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డితో పాటు ఇతర నేతలు ఇటీవల పవన్ కల్యాణ్‌ను కలిసి.. సమ్మెకు మద్దతివ్వాలని కోరారు. దీనిపై స్పందించిన పవన్.. ఆర్టీసీ అంశంపై రెండు రోజుల్లో కేసీఆర్‌తో ప్రత్యేకంగా చర్చిస్తానని అన్నారు. కేసీఆర్‌పై తనకు అపారమైన గౌరవం ఉందన్న ఆయన.. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం మంచిది కాదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఆర్టీసీ సమ్మెపై ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సమ్మెపై ఇవాళ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu