
హైదరాబాద్ చాదర్‌ఘాట్ కాల్పుల కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. డీసీపీ ఫిర్యాదుతో సుల్తాన్‌బజార్ పీఎస్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సెల్‌ఫోన్ దొంగను పట్టుకునేందుకు వెళ్లిన హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్యపై కత్తితో దాడికి ప్రయత్నించాడు. అన్సారీ గ్యాంగ్ డీసీపీ, గన్‌మన్‌పై దాడికి ప్రయత్నించడంతో.. డీసీపీ చైతన్య తన తుపాకీని బయటకు తీసి 2 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటన డీసీపీ, గన్‌మెన్ గాయాలయ్యాయి.. ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో నిందితుడికి మూడు చోట్ల బుల్లెట్ గాయాలు అయ్యాయి.. కాగా.. ఇవాళ మరోసారి విక్టోరియా గ్రౌండ్స్‌కు వెళ్లిన క్లూస్ టీమ్ పలు కీలక వివరాలు సేకరిస్తున్నారు. తప్పించుకున్న మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.. ఈ ఘటనలో గాయపడ్డ DCP, గన్‌మెన్‌కు చికిత్స కొనసాగుతోంది.. ఇక పోలీసుల కాల్పుల్లో గాయపడ్డ రౌడీషీటర్ అన్సారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ చాదర్‌ఘాట్ లో శనివారం విక్టరీ ప్లే గ్రౌండ్ దగ్గర మహ్మద్ ఒమర్ అన్సారీ, మరో వ్యక్తి మొబైల్ స్నాచింగ్‌కి ప్రయత్నించారు. అదే టైమ్‌లో అటుగా వెళ్తున్న DCP చైతన్య వీళ్లను గమనించి పట్టుకోబోయారు.. తప్పించుకునే క్రమంలో అన్సారీ.. DCP గన్‌మెన్‌పై కత్తితో దాడి చేశాడు. ఊహించని ఘటనతో వెంటనే DCP చైతన్య వెపన్‌తో వాళ్లపై ఫైర్ చేశారు. 2 రౌండ్లు కాల్పులు జరిపారు. అన్సారీ భుజంలోకి ఒక తూటా, ఛాతిలోకి మరో తూటా దూసుకెళ్లాయి.. ప్రస్తుతం అతన్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పాతబస్తీకి చెందిన రౌడీ షీటర్ అన్సారీపై చాలా కేసులున్నాయి. 2 ఏళ్లు జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఐనా.. తీరు మార్చుకోలేదు.. ఈ ఏప్రిల్‌లో బయటకువచ్చి మళ్లీ దోపిడీలు చేస్తున్నాడు. చివరికి నిన్న కాల్పుల్లో బుల్లెట్ గాయాలపాలై ఆస్పత్రిలో పడ్డాడు..
కాగా.. రౌడీషీటర్లకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇష్టమొచ్చినట్టు ఆయుధాలతో తిరుగుతూ.. ప్రజల్ని ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. పోలీసులపై దాడులు చేస్తే సరైన గుణపాఠం చెప్తామని సీపీ సజ్జనార్ స్పష్టంచేశారు. అరాచకశక్తుల్ని ఉక్కు పాదంతో అణిచివేస్తామన్నారు. మొబైల్ స్నాచింగ్ జరుగుతుంటే DCP చైతన్య, గన్‌మెన్ చూసారని.. దొంగను పట్టుకోబోతే కత్తితో వాళ్లపై దాడి చేశాడన్నారు. అందుకే.. DCP చైతన్య కాల్పులు జరపాల్సివచ్చిందన్నారు.
#WATCH | Hyderabad, Telangana: Police Commissioner VC Sajjanar says, “Around 5 pm, DCP Chaitanya and his gunman saw a mobile snatching at Chadar Ghat Victory Playground. They tried to apprehend the offender, who attacked with a knife. During the scuffle, DCP fired two rounds,… pic.twitter.com/85ZqzbBUy7
— ANI (@ANI) October 25, 2025
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..